స్టార్ హీరోయిన్ కృతి సనన్.. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తాజాగా కృతీ శనన్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకి మ్యాటర్ ఏంటంటే గ్రీస్ ఏరియాలో కృతీ సిగరెట్ తాగుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది.
ఈ క్రమంలో గతంలో కృతి సనన్ తల్లి షేర్ చేసిన ఓ ట్విట్ షేర్ చేస్తూ నెటిజన్స్ ఆమెను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కృతి సనన్ సిగరెట్ తాగడం కాదు కదా.. ఆమెకు అవాసన కూడా పడదు.. తన చుట్టూరు ఎవరైనా స్మోకింగ్ చేసినా కూడా వారితోను వాదిస్తుంది అనే సారాంశం వచ్చేలా ఓ ట్విట్ షేర్ చేసింది. ప్రస్తుతం సిగరెట్ తాగుతూ అమ్మడు అడ్డంగా దొరికిపోవడంతో తన తల్లిని ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ట్రోలర్స్.
అయితే కొంతమంది మాత్రం ఆ వీడియో అంతగా స్పష్టంగా కనిపించడం లేదని.. ఆమె అసలు కృతి సన్నన్ కాదు అంటూ.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్కడ స్మోక్ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ.. ఆమె సిగరెట్ తాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపించడం లేదని.. ఇలా అర్థంపర్థం లేకుండా నెగటివ్ ట్రోల్స్ చేయడంలో అసలు ఉపయోగం ఏముంది అంటూ ట్రేలర్స్ పై ఫైర్ అవుతున్నారు కృతి సనన్ ఫ్యాన్స్.
Kriti Sanon Vacation in Greece #KritiSanon #Munjya @GeetaSanon pic.twitter.com/jWLum8P6iS
— Pikachu (@PPinYourPP) July 29, 2024