ఓర్నీ.. ఒట్టేసి చెబుతున్న హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..?

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. అందంతో పాటు.. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే వదిగిపోయ్యే టాలెంట్ ఉన్నా కూడా.. కొన్ని కొన్ని సందర్భాల్లో నటులుగా సక్సెస్ కాలేకపోతారు. ల‌క్‌ కలిసి రాక అవకాశాలు లేక‌ ఇండస్ట్రీకి దూరమవుతారు. ఈ పై ఫోటోలో చూస్తున్న బ్యూటీ కూడా అదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు భ‌లే క్యూట్‌గా చూడగానే ముద్దొచ్చేలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్ర‌స్తుతం అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా.. తనే దివ్య వెంకట సుబ్రహ్మణ్యం.

తెలుగుతోపాటు కన్నడ, మలయాళ సినిమాల్లోను నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్‌గా.. మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. చెన్నై నుంచి వచ్చిన ఈ బ్యూటీ కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైంలో మ్యారేజ్ చేసుకొని సినిమాలను స్లో చేసింది. 2003లో శ్రీకాంత్ హీరోగా నటించిన ఒట్టేసి చెబుతున్నా మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య.. తర్వాత రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో మెరిసింది. అందం, టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్‌లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ్, మలయాళం భాషలో వరుస సినిమాలను చేస్తూ బిజీ అయింది.

ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సూపర్ పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల తమిళ్ లో ఓ రెండు సినిమాల్లో క్యారెట్ ఆర్టిస్ట్‌గాను కనిపించింది. సోషల్ మీడియా ద్వారా ఫాన్స్‌కు ఇప్పటికీ దగ్గరగా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 42 ఏళ్ళ వయసులోనూ యంగ్ హీరోయిన్‌లా కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఏమాత్రం తీసిపోని అందంతో నెట్టింట సెగలు రేపటితుంది. అయితే మునుపటి కంటే కాస్త ఒళ్ళు చేసి.. బబ్లీ బ్యూటీలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోస్, వీడియోస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారాయి.