టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో బన్నీకి మంచి సక్సెస్ వచ్చిన బాడీ షేమింగ్ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక తన లుక్‌తో ఎన్ని విమర్శలను ఎదుర్కొన్న బన్నీ.. కాస్త టైం తీసుకుని ఆర్య సినిమాతో సరికొత్త లుక్ లో ప్రేక్షకులకు కనిపించి మెస్మరైస్ చేశాడు.
సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్య సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న బన్నీ తర్వాత ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.. మళ్ళీ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప సినిమాతోనే ఇన్నీకి పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చింది. కాగా నేషనల్ అవార్డుని కూడా దక్కించుకొని రికార్డ్ సృష్టించాడు. ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ గా పుష్పా 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా ప్రస్తుతం కెరీర్ పట్ల మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న బన్నీ గతంలో సర్జరీలు చేయించుకున్నాడు అంటూ.. ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
అందంగా కనిపించడానికి అల్లు అర్జున్ సర్జరీలు చేయించుకున్నారు అంటూ నెటింట పలు ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు తమ అందం కోసం సర్జరీలు చేయించుకోవడం కామన్. అయితే అల్లు అర్జున్‌కు జరిగిన సర్జరీల గురించి ఓ ప్రముఖ డాక్టర్ తాజాగా ఆసక్తికర విషయాలను రివీల్ చేశాడు. కనుక సర్జరీ ప్రొఫెషనల్ డాక్టర్ రాజశేఖర్‌కు కెరీర్ స్టార్టింగ్ లో బన్నీ ఫోటోలను చూపించగా.. తన అందం కోసం బన్నీ ముక్కు అలాగే పెదాలు సర్జరీని చేయించుకున్నారని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రెటీస్ ఇలాంటి సర్జరీలు చేయించుకోవడం కామన్‌గా మారిపోయింది. అయినా బన్నిని మాత్రం యాంటి ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.