ఏకంగా 23సర్జరీలు.. 4 ఏళ్ళు వీల్ చైర్.. ఈ స్టార్ హీరోను ఎవ‌రో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం సహజం. ఇక స్టార్ హీరోలుగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న తర్వాత.. లక్షల మంది అభిమానులు ఉంటారు. వాళ్లకు నచ్చినట్లుగా ప్రతి సినిమాను తెర‌కెక్కించి ప్రేక్షకులను మెప్పించడం అనేది సాధారణ విషయం కాదు. ఒకసారి స్టార్‌డం వచ్చిన తర్వాత ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలా ఎంతో శ్రమించి ఇండస్ట్రీలో ఎన్నో ఎదురెదెబ్బలు తిన్నా కూడా.. స్ట్రాంగ్ గా నిలబడి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా ఒకరు. ఈయన ఒక సందర్భంలో ప్రమాదంలో చెక్కుకొని 23 సర్జరీలను చేయించుకున్నారట. ఏకంగా నాలుగేళ్ల పాటు వీల్ చైర్‌కే పరిమితమైన తర్వాత.. మెల్లమెల్లగా కోలుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

ఇంత‌కి ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ఆయన మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ లోనూ అదే రేంజ్‌లో సక్సెస్ సాధించి స్టార్ హీరోగా దూసుకుపోతున్న విక్రమ్.. ఇప్పటికే తెలుగులో అపరిచితుడు, మల్లన్న, ఐ లాంటి సినిమాల్లో నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇతను నటించిన అపరిచితుడు సినిమా ఇప్పటికీ టీవీలో వస్తుందంటే స్క్రీన్‌లకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు. అంతలా ఈ సినిమాతో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న విక్రమ్ మళ్ళీ అదే రేంజ్‌లో ఒక హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. తెలుగులో ఆయన మార్కెట్ ప్రస్తుతం పూర్తిగా పడిపోయింది. అయినా ప్రస్తుతం విక్రమ్ నటించిన తంగల‌న్‌ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతుంది.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు, గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తంగలాన్‌ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న విక్రం ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడట. ఏకంగా నాలుగేళ్ల పాటు వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడట. 12 ఏళ్ళ వయసులో యాక్సిడెంట్ తో తీవ్రంగా గాయపడిన ఆయన.. కుడికాలు దెబ్బతినడంతో ఏకంగా 23 సర్జరీలు చేయించుకున్నాడట. నాలుగేళ్ల పాటు వీల్‌చైర్‌కు పరిమితమైన సంకల్పంతో లేచి నడవడం మొదలుపెట్టారట. తర్వాత మెల్ల మెల్లగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చిన్నచిన్న పాత్రలో నటిస్తూనే హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్‌ వివరించాడు.