టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అయిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతంలో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూడు సినిమాల షూటింగ్ పెండింగ్‌లోనే ఉంచేసాడు. దీంతో ఈ సినిమాల దర్శక, నిర్మాతలలో ఆందోళన మొదలైంది. మరీ పక్కన పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ మూడు సినిమాల్లో ఏదైనా ఒక్క సినిమా అయినా రిలీజైతే బాగుండని కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఈ ఇంట్రస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూడు సినిమాలలో ఓ సినిమాకు విలన్‌గా మెగాస్టార్ నటించబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో గతంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మామంగం సినిమా ట్రైలర్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వైరల్ చేస్తూ.. 2008లో వచ్చిన జల్సా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కోసం మమ్ముట్టిని అప్రోచ్ అయ్యానని.. కానీ ఆయన విలన్ పాత్రలో చేయడానికి రిజెక్ట్ చేశాడంటూ వివరించాడు. నన్ను నేను.. చిరంజీవితో పోల్చుకుంటే మీరు ఇలాంటి విలన్ పాత్ర కోసం నన్ను అడగడం సరైనదేనా అంటూ ఆయన అడిగారని.. అల్లు అరవింద్ వివరించాడు.
ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ చేస్తూ ఫ్యాన్స్ అయిన పై మండిపడ్డుతున్నారు. ఇక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీలతో పాటు ఎన్నో భాషల్లో హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్ని సార్ హీరోగా దూసుకుపోతున్న మమ్ముట్టి పవన్ కళ్యాణ్ సినిమాల్లో విలన్‌గా నటించడం ఏంటి.. అది ఎప్పటికీ జరగదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం వీరిద్దరికి కాంబోలో నిజంగా ఓ సినిమా వస్తే అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడం ఖాయం.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పట్లో మమ్ముట్టి సినిమాను రిజెక్ట్ చేసినా.. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఆ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.