టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలయ్య, చిరు ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తే తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్యన సినిమాల పరంగా ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరు ఎన్నోసార్లు తమ సినిమాలతో ఒకరితో ఒకరు తలపడ్డారు. ఇక చిరు, బాలయ్య సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అంటే ఫ్యాన్స్ మధ్యన ఎలాంటి వార్ జరుగుతుందో.. థియేటర్స్ దగ్గర ఎలాంటి వేడి రాజు కుంటుందో తెలిసిందే.
ఇక ఇప్పటికి వృత్తిపరంగా తమ సినిమాలతో పోటీపడుతున్న చిరు , బాలయ్య గతేడాది సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో తలపడ్డారు. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు తలపడ్డా ఈ ఇద్దరు హీరోస్ ఒకే స్టేజ్ పై కనిపించారంటే అది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అని చెప్పాలి. ఇక తాజాగా బాలయ్య చీఫ్ గెస్ట్ గా వెళ్లిన మెగాస్టార్ సినిమా ఒకటి మంచి సక్సస్ అందుకుందంటూ వార్త నెట్టింట వైరల్ గా మారింది. చిరంజీవి హీరోగా నగ్మా, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించిన ఘరానా మొగుడు సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే.
దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై, దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్ గా , కే. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో చిరంజీవికి టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ క్రియేట్ అయింది. తొలిసారిగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ హీరోగా చిరంజీవి సినిమాతో రికార్డు కూడా సృష్టించాడు. అయితే సినిమా ముహూర్తం షాట్ కు బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా వచ్చారట. ప్రారంభోత్సవం టైం లోనే ఇంటర్వెల్ సీన్ షూట్ చేశారట. ఇక ఈ సీనుకు బాలకృష్ణ క్లాప్ కొట్టి సీన్ పూర్తి అయిన వెంటనే అక్కడే ఉన్న మంచం మీద చిరంజీవి, బాలకృష్ణ కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. అప్పుడు తీసిన ఓ ఫోటో ఇప్పుడు నెటింట తెగ వైరల్ గా మారింది. దీంతో బాలయ్య ఈ సినిమాకు క్లాప్ కొట్టి బాలకృష్ణ సినిమాను ప్రమోట్ చేయడంతోనే సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది అంటూ బాలయ్య అభిమానులు తమ హీరొను ప్రసంసిస్తున్నారు.