ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ వారసులుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. తమ టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎంత స్టార్ కిడ్స్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదృష్టం కలిసి రాదు. టాలెంట్ తో పాటు పిసరంతా అదృష్టం కూడా ఉంటేనే సినీ రంగంలో ఎలాంటి వారైనా రాణించగలరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు పిల్లలు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొందరు సక్సెస్ అయ్యారు. అయితే కొందరు మాత్రం అసలు సక్సెస్ కాలేకపోయారు.
కానీ ఈ పైన కనిపిస్తున్న ఇద్దర ఇండస్ట్రీలో తోపులు. తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్‌డం సంపాదించుకున్నారు. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రొఫెషన్స్ వేరైనా ఇద్దరు టాలీవుడ్ లో తోపులే. వీళ్ళు ఎవరో గుర్తుపట్టారా.. పై ఫోటోలో ఉన్న ఈ ఇద్దరిలో బుడ్డోడు స్టార్ హీరో. ఆ కుర్రాడు ప్రస్తుతం స్టార్ కెమెరామెన్. ఇంతకు ఆ ఇద్దరు ఎవరో కాదు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కెమెరామెన్ చోటా కె నాయుడు. సందీప్ కిషన్ ప్రస్తుతం హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని పలు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చోట కె నాయుడు తన ప్రొఫెషన్ లో.. కెమెరామ్యాన్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేశాడు.
ఇక చోట కే నాయుడు మేనల్లుడే హీరో సందీప్‌కిషన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోగానే కాదు ఈ సినిమాల్లో కీలకపాత్రలో కూడా నటించి మెప్పించాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. బాలీవుడ్ లోనూ పలు సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇన్ ద సిటీ మూవీ తో హిందీ బాలీవుడ్‌కు పరిచయమైన తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు పలు సినిమాల్లో సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాలో ధనుష్ తమ్ముడి పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.