పవన్ కళ్యాణ్ గెలవడానికి ఆ మెగా లక్కీ సెంటిమెంటే కారణమైందా..? కరెక్ట్ పాయింట్ పట్టేసిన ఫ్యాన్స్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు . నమ్మకానికి .. నిజాయితీకి.. నిలువెత్తు నిదర్శనం అంటూ ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే . గత సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా కూడా చూస్తున్నాము. ఇన్నాళ్లు ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కింది అంటూ ఓ రేంజ్ లో ప్ర్శంసిస్తున్నారు పలువురు జనాలు.

ఆయనకు సంబంధించిన వీడియోలను సైతం బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ గెలవడానికి ఆ మెగా లక్కి సెంటిమెంట్ కూడా కారణమైంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గెలవడానికి పరోక్షకంగా మెగా మనవరాలు క్లీం కారా కూడా ఓ కారణం అంటున్నారు అభిమానులు . క్లీం కార పుట్టినప్పటినుంచి మెగా ఫ్యామిలీకి భాగా లక్కీ సెంటిమెంట్ కలిసొస్తుంది .

అంతేకాదు క్లీంకార పుట్టగానే వరుణ్ తేజ్ పెళ్లి కావడం.. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కి పద్మ విభూషణ్ అవార్డు రావడం..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీతో విజయం రావడం ..ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీలో అన్ని హిట్ సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి లక్కీ గర్ల్ గా మారిపోయింది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. మరి క్లీం కార నెక్స్ట్ ఏ విధంగా ఎవరికి అదృష్టం తీసుకొస్తుందో వేచి చూద్దాం..!!