టాలీవుడ్ ఇండస్ట్రీలో అరుదైన దర్శకుల్లో ఒకరిగా డైరెక్టర్ గుణిశేఖర్‌కు మంచి గుర్తింపు ఉంది. 33 ఏళ్ల కెరీర్‌లో కేవలం 13 సినిమాలను మాత్రమే ఆయన తెరకెక్కించాడు. దీన్నిబట్టి ఆయన ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడతారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నాడంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణ తీసుకొని లోతుగా పరిశీలించిన తర్వాతే ఆయన మెగా ఫోన్ పడతారని టాక్ ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా లాఠి తోనే అవార్డ్ అందుకుని ఆయన దానిని ప్రూవ్ చేశాడు. రెండవ సినిమా సొగసు చూడ తరమా సినిమాకి సైతం ఆయనకు నంది అవార్డు దక్కింది. ఇక ఆయన మూడో సినిమా బాల రామాయణం జూనియర్ ఎన్టీఆర్ ఇందులో రాముడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.
ఈ సినిమాకు మంచి గుర్తింపు రావడంతో పాటు నేషనల్ అవార్డ్ కూడా వరించింది. ఇలా రామాయణం తెరకెక్కించిన తరువాత ఎవరు కమర్షియల్ సినిమా తీయాలని చూడరు. కానీ గుణశేఖర్ మాత్రం ఆ సాహసం చేశాడు. చూడాలని ఉంది సినిమాను తెరకెక్కించి ఈ సినిమాతోనూ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మనోహరం సినిమాను తెరకెక్కించి ఉత్తమ రైటర్ గా గుణశేఖర్ నంది అవార్డు దక్కించుకున్నాడు. చిరంజీవి మృగరాజు డిజాస్టర్ అయ్యింది. అలాగే మహేష్ బాబు తో ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాలను వరుసగా తెరకెక్కించి మూడు సినిమాలు తోనూ పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాడు. ఇలా మహేష్ బాబు ఒకే దర్శకుడు తో వరుసగా మూడు సినిమాలు చేయడం అదే మొదటిసారి.
ఇక ఈ సినిమాల తర్వాత అల్లు అర్జున్‌తో వరుడు సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో గోప్యంగా ఉంచడంతో సినిమాపై మంచి హైప్ పెరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ నిలిచింది. తర్వాత నిప్పు సినిమాతో ప్లాప్ ఎదుర్కొన్నాడు. ఈసారి రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా హిస్టారికల్ సైడ్ లో అనుష్కతో.. రుద్రమదేవి సినిమాని తరికెక్కించాడు గుణశేఖర్. ఈ సినిమాకు నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో తనే స్వీయ నిర్మాణంలో సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రావడంతో పాటు సినిమా మంచి సక్సెస్ సాధించింది. తర్వాత 8 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకున్న ఈయన శకుంతలంతో మరోసారి స్వీయ నిర్మాణంలో ఓ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈసారి మాత్రం సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇలా గుణశేఖర్ తాను తెరకెక్కించిన 13 సినిమాల్లో మొత్తం పది సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకుని రికార్డ్ సృష్టించాడు.