నాగార్జున కోట్లలో ఆస్తులు కూడబెట్టడం వెనుక అసలు కారణం ఇదే.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన జగపతిబాబు..?!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పాపులారిటి దక్కించుకోవాలన్నా.. స్టార్ డంను కొనసాగించాలన్న ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇప్పటికీ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ హీరోల‌లో నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నాగార్జున కేవలం సినిమాలకు మాత్రమే కాదు.. ఎన్నో వ్యాపారాలకు, బుల్లితెర షోలకు కూడా పనిచేస్తూ భారీగా గడిస్తున్నాడు. ఓ పక్కన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఆల్రౌండర్ గా దూసుకుపోతున్నాడు.

Story Behind Nag-JB's Chow-Chow

ఈ క్రమంలో భారీ స్థాయిలో అస్తులు కూడ పెట్టాడు టాలీవుడ్ కింగ్. ఇక వీటిలో నాగార్జున తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కొంత ఉన్నప్పటికీ.. ఈయన కూడా భారీ లెవెల్ లో ఆస్తులను పోగు చేసినట్లు తెలుస్తుంది. అయితే నాగార్జున ఇలా ఆస్తులను సంపాదించడానికి ఉన్న కారణాలు జగపతిబాబు ఇటీవల ఇంటర్వ్యూలో వివరించాడు. నాగార్జున తనకు చాలా క్లోజ్ అని చెప్పిన ఆయన.. నాగ్‌ను ముద్దుగా చౌ అని పిలుస్తానని.. నేను తప్ప ఇండస్ట్రీలో అతన్ని ఎవరు అలా పిలవరు అంటూ వివరించాడు.

I didn't enjoy 'Guntur Kaaram': Jagapathi Babu

ఆయన కూడా నన్ను అలాగే పిలుస్తారని.. మా పేర్లలో చౌదరి ఉండడం వల్ల అలా పిలుచుకుంటామని వివరించాడు. నాగ్‌ను నేను రెండు రోజులకు ఒకసారి అయినా కలుస్తూ ఉంటాన‌ని వివరించిన జగపతిబాబు.. ఆయన ఆస్తుల గురించి మాట్లాడుతూ.. ఈ స్థాయిలో ఆస్తులను కూడబెట్టడానికి కారణం ఆయన ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారంటే.. ఆ బిజినెస్ వ్యవహారాలన్నింటినీ ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండనివ్వరు. అదే తన సక్సెస్ సీక్రెట్ అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చాడు.