బుచ్చిబాబు మూవీ కోసం కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రిస్క్ చేయనున్న చరణ్..?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న ఈయన.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాతో ఎలాగైనా ప్రేక్షకుల అంచనాలను అందుకుని మంచి సక్సెస్ సాధించాలని కసితో ఉన్నాడు చరణ్. దీంతో ఈ సినిమా కోసం ఎన్నో కసరత్తులు చేసి మరీ శ్రమించాడు.

Stunning working stills of Ram Charan in Rangasthalam

ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చరణ్ ఓ రిస్క్ చేస్తున్నాడు అంటూ తెలుస్తుంది. ఆయనే సినిమాకు అవసరమని కర్ర సాము నేర్చుకుంటున్నాడట. ఓ కీలకమైన సన్నివేశంలో ఇది కచ్చితంగా అవసరం ఉంటుందని.. డూప్ తో చేయించుదామని బుచ్చిబాబు చెప్పినప్పటికీ.. చరణ్ మాత్రం వినకుండా తానే స్వయంగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడట.

Ram Charan's RC 16: Director Buchi Babu Sana drops major update; says film  will be sure shot blockbuster | PINKVILLA

దీంతో నెల రోజులు పాటు దీనిపై శ్రమించనున్నాడని.. ఇది చూసిన బుచ్చిబాబు.. చిరంజీవి గారు ఎలా కష్టపడతారు.. నేను చూడలేదు. కానీ రామ్ చరణ్ గారిని చూస్తుంటే చిరంజీవి గారు అనుభవించిన కష్టం ఇలాంటిదే నేమో అనిపిస్తూ ఉంటుందని తన టీం తో చెబుతూ ఉంటాడట. ఇక ఈ న్యూస్ నెటింట‌ వైరల్ అవ్వడంతో చరణ్ అంతగా కష్టపడ్డారు కాబట్టే అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరో రేంజ్‌కు చేరుకున్నాడు అంటూ.. మా చరణ్ డెడికేష‌న్‌ అలానే ఉంటుందంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.