ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రియమణి.. మొదటి జీతం మరి అంత తక్కువా.. ?!

ప్రముఖ స్టార్ బ్యూటీ ప్రియమ‌ణీకు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు బాలీవుడ్ లోనూ పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె నటించిన పరుత్తి వీరన్ సినిమాకు బెస్ట్ యాక్టర్స్‌ గా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఓవైపు వెండి తెరపై సినిమాలు నటిస్తూ బిజీగా గడుపుతూనే.. మరోవైపు బుల్లితెర పై కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రియమణి. ఇక ప్రస్తుతం వరుస‌ సినిమాలు, బుల్లితెర షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. దానికి తగ్గట్టుగా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

Priyamani's Royal Blue Silk Saree During Maidaan Promotions Is Perfect  Wedding Wear - News18

రాజ్, డీకే డైరెక్షన్‌లో వచ్చిన ది ఫ్యామిలీ మెన్ సిరీస్ లో సుచిత్ర పాత్రలో నటించి మెప్పించిన ప్రియ‌మ‌ణి ఇప్పుడు థర్డ్ సీజన్ లో నటించేందుకు సిద్ధమవుతుంది. ఈ సిరీస్ కోసం అమ్మడు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా ప్రస్తుతం కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తున్న ప్రియ‌మ‌ణి మొదటి జీతం కేవలం రూ.500 తెలియడంతో అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. 2003లో ఎవరే అతగాడు సినిమాతో అమ్మడు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు ప‌డ్డాయి.

Happy Birthday Priyamani, 5 Lesser Known Facts About Narappa Actress -  News18

తర్వాత తమిళ, మలయాళ, కన్నడ సినిమాలోని ఆఫర్లు దక్కించుకుంది. స్టార్ హీరోల పక్కన గ్లామరస్ హీరోయిన్ పాత్రలో మెప్పించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తన మొదటి జీతం ఆమెకు మోడలింగ్ ద్వారా వచ్చిందని.. ఆమెకు వచ్చిన మొదటి జీతం కేవలం రూ.500 అయినా అది ఇప్పటికీ దాచుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీ అమ్మడు చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. కెరీర్ చిన్న మోడల్గా ప్రారంభించి.. స్టార్ హీరోయిన్ కోట్లలో రెమ్యూనరేషన్ రేంజ్‌కు ఎదగడం అంటే అది సాధారణ విషయం కాదు.. ఎంతో కష్టపడాల్సి వస్తుంది దీనిని బట్టే ప్రియమణి కష్టమేంటో తెలుస్తుంది అంటూ ఆమెను తెగ పొగడేస్తున్నారు అభిమానులు.