టాలీవుడ్ లో నందమూరి నట వారసులుగా రెండో తరం హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారిలో హరికృష్ణ ఒకరు. ఈయన నటించింది అతి తక్కువ సినిమాల్లోనే అయినా ఆ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. హరికృష్ణ వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మూడో తరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకుంటూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.
అయితే కళ్యాణ్ రామ్ మొదట పలు ప్లాప్స్ చెవిచూసిన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇద్దరికీ టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక హరికృష్ణ కొంతకాలం క్రితం కార్ యాక్సిడెంట్ లో మరణించారు. అయితే హరికృష్ణ బ్రతికి ఉన్న సమయంలో ఆయన ఇద్దరు కొడుకులు నటించిన సినిమాల్లో ఆయన ఫేవరెట్ సినిమాలు ఇవే అంటూ ఓ సందర్భంలో వివరించారు. ఇంతకీ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ నటించిన సినిమాల్లో హరికృష్ణ ఫేవరెట్ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
వాటిలో మొదటిది పటాస్. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన టెంపర్, జనతా గ్యారేజ్ సినిమాలు అంటే హరికృష్ణకు చాలా ఇష్టమని వెల్లడించారు. ఈ సినిమాలు మూడు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకొని ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక కళ్యాణ్ రామ్ లైఫ్ లో పటాస్ చాలా స్పెషల్ మూవీ గా నిలిచిపోయింది. టెంపర్ తో ఎన్టీఆర్‌కు మరోసారి స్ట్రాంగ్ కం బ్యాక్ వచ్చింది.
దీంతో ఎన్టీఆర్ కూడా టెంపర్ ను స్పెషల్ మూవీ గా భావిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఒక క్రేజీ ప్రాజెక్టులు నటిస్తూ బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దేవరా సినిమాలో నటిస్తున్నాడు. తారక్, రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న తారక్.. ప్రతి సినిమాపై ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర అక్టోబర్ 10న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాతో తారక్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి.