ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కూటమి భారీ దిశగా గెలుపును ఖాయం చేసుకోవడంతో సంచలనంగా మారింది . అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయ చరిత్ర తిరగరాయడానికి కారణం అంటూ కూడా టాక్ వినిపిస్తుంది . ఇలాంటి క్రమంలోనే కొంతమంది సినీ స్టార్స్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయనివాళ్లను ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు మెగా అభిమానులు .కాగా ఇదే మూమెంట్లో ఎన్టీఆర్ కి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే పాలిటిక్స్ కి ఈ వీడియోకి ఏమాత్రం సంబంధం లేదు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేశారు ఎన్టీఆర్ ఆ విషయం మన అందరికీ తెలిసిందే.
ఆ షోలో ప్రముఖ కవి గుర్రం జాషువా.. పద్యాలకు సంబంధించిన క్వశ్చన్ వేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పార్టిసిపేట్ చేసే వ్యక్తి.. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వలేకపోతాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆన్సర్ ఇవ్వలేక పోతారు. అయితే ఎనిమిదవ తరగతి చదువుతున్న పాప ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది . మాకు 8వ తరగతిలో గుర్రం జాషువా గారి లెసన్స్ ఉంటాయి. స్టేట్ సిలబస్ అందులో శతక సుధ అనే పోయెమ్స్ కూడా ఉంటాయి.. మా టీచర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని ఆ పాప చెబుతుంది .
సో నీకు గుర్రం జాషువా గారి గురించి తెలుసు .. అందుకే ఈ ఆన్సర్ చెప్పావని ఎన్టీఆర్ అడుగుతాడు .. దానికి ఆ పాప అవును తెలుసు అని జవాబు ఇస్తుంది. దీంతో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ సిగ్గుండాలండి మనకు అంటూ తలదించుకొని షాకింగ్ గా మాట్లాడుతాడు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సిగ్గు ఉండాలండి మనకు.. ఎంబీఏ ఫైనాన్స్ చదివి ఎందుకు అన్నట్లుగా కామెంట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆయన ప్రౌడ్ అఫ్ యు బేబీ అంటూ కూడా ఆ పాపను పోగొడతాడు . ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!