ఏపీ కూటమి వైసీపీను క్లీన్ స్విప్ చేసేసింది . దారుణాతి దారుణంగా పడగొట్టేసింది . ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నేతలు ఇప్పుడు దారుణాతి దారుణంగా ఓడిపోవడంతో.. బిక్కు మొహం వేసుకుంటూ ఇంటికి పయనం అవ్వాల్సిన పరిస్థితి దాపురించింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. దాదాపు 74 వేల మెజారిటీతో ఆయన గెలుపొందడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలాంటి క్రమంలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి విజయాన్ని అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ చేశారు. చిరంజీవి తన ట్వీట్ లో.. డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్‌వి మాత్రమే కాదు, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
అంతేకాదు ఈ ట్వీట్ చూసిన కొందరు ” నువ్వు చేయలేని పని మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ చేశాడు ..రియల్లీ గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు”. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎలా సగంలో హ్యాండ్ ఇచ్చాడు..అది అందరికీ తెలిసిందే . ఆ విషయాలను గుర్తు చేస్తూ చిరంజీవి మనసును హర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . కాని మెగా ఫ్యామిలీనే కాదు ఏపీ రాష్ట్ర ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు..!!
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024