ఇకనుంచి బుల్లితెరపై సందడి చేయనున్న హన్సిక.. ఆ షోకు జడ్జిగా స్టార్ హీరోయిన్..?!

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న చాలామంది నటీమణులు టీవీ షోలకు ప్రాధాన్యత ఇస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే.. మ‌రో ప‌క్క బుల్లితెరపై జడ్జిలుగా వ్యవహరిస్తున్న వారిని చూస్తూనే ఉన్నా. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే షోలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారపన్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా ఈటీవీ బిగ్గెస్ట్ డాన్స్ షో ఢీలో ప్రతి సీజన్‌కు కొత్త న్యాయ నిర్ణీతలను తీసుకుంటూ షోపై మరింత హైప్‌ పెంచుతున్నారు. ఢీ సెలబ్రిటీ సీజన్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో తాజా సీజన్ మొదలుకానుంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ఢీ ప్రోమో చూస్తుంటే ఈసారి కూడా స్టార్ హీరోయిన్‌ను జడ్జిగా తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్‌లో ప్రణీతను జడ్జిగా తీసుకువచ్చారు.

Hansika : టీవీలోకి వచ్చేసిన హన్సిక.. ఆ డ్యాన్స్ షోకి జడ్జిగా.. | Hansika  motwani entry into tv shows with dance dhee show-10TV Telugu

ఇప్పుడు హన్సిక ఈ సీజన్ జ‌డ్జ్‌గా రానుంద‌ట‌. గతంలో శ్రియా లాంటి స్టార్ హీరోయిన్ కూడా ఈ షో కి న్యాయనిర్ణేత‌గా వ్య‌వహ‌రించిన సంగతి తెలిసిందే. ఇక హన్సిక ఈ షో కి జడ్జ్ గా వివహ‌రిస్తుందని తెలియడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ షో కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రిలీజై నెటింట‌ ట్రెండిగా మారింది. మరో మ్యాటర్ ఏంటంటే.. హన్సికతో పాటు శేఖర్ మాస్టర్, మాస్టర్ గణేష్ కూడా జడ్జ్ లుగా వ్యవహరించనున్నారు.