అన్నయ్య , అమ్మ ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!

సీనియర్ హీరోయిన్ ఆమ‌నీకి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి.. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటుంది. అలాగే పలు బుల్లితెర షోలలోను సందడి చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని మాట్లాడుతూ ఎన్నో షాపింగ్ విషయాలను రివిల్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె అనుభవాలను షేర్ చేసుకుంది.

Aamani Movies, News, Photos, Age, Biography

ప్రస్తుతం ఆమని క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని.. అలాంటివన్నీ కామన్.. అలనాటి స్టార్ బ్యూటీ సావిత్రి కాలం నుంచి హీరోయిన్స్ సమస్యలను ఎదుర్కొంటున్నారు అంటూ ఆమె వివరించింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్కటి వెలుగులోకి వస్తుంది.. అంతేకాదు చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపిస్తున్నారు అంటూ వివ‌రించింది.

Aamani : Biography, Age, Movies, Family, Photos, Latest News - Filmy Focus

అయితే ఏ ప్రొఫెషన్ లో అయినా మంచి చెడు రెండు ఉంటాయి. కష్టాలను దాటుకునే స్టార్ గా ఎదగాలి. ఇక నా విషయంలో తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయంలో క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరైతే ఏకంగా మా అమ్మ, అన్నయ్యల ముందే డ్రెస్ తీసి చూపించమని డిమాండ్ చేసేవారు. ఆ రోజులు గుర్తుకు వస్తే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. ఆ మాటలు విని లేచి అక్కడి నుంచి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ వివరించింది. అయితే మీ టు మూమెంట్లో మాత్రం నేను లేనట్టు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమ‌ని చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.