చంద్రబాబు గెలవడానికి.. జగన్ ఓడిపోవడానికి ఆ ఒక్కటే కారణం.. దరిద్రం అలా వెంటాడిందా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే దారుణాతి దారుణంగా ట్రోలింగ్కి గురవుతున్నాడు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నిన్న మొన్నటి వరకు ఏపీ సీఎం గా బాగా పిలిపించుకొని .. ఆ పేరుకు అలవాటు పడిపోయారు. ఒక్కసారిగా ఆయన తలరాత మారిపోయింది . రీజన్ ఏంటో తెలియదు కానీ జగన్ ఊహించని స్థాయిలో దారుణాతి దారుణంగా పడిపోయారు . కేవలం 11 అంటే 11 సీట్లు మాత్రమే ఆయన గెలుచుకోవడం ఆయన రాజకీయ చరిత్రకే ఒక నెగిటివ్గా మారిపోయింది .

అయితే ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ పలు సర్వేలు అన్నీ చంద్రబాబు గెలుస్తాడు అని చెప్తూ వచ్చాయి .. కానీ ఇంత భారీ మెజారిటీతో గెలుస్తాడు అన్న విషయం మాత్రం ఎవ్వరు ఊహించలేకపోయారు. ఈ విషయాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఊహించలేదు. జనసేన 21 /21 గెలవగా ..చంద్రబాబు భారీ స్థాయిలో ఏపీ కూటమిని అధికారం చేపట్టే దిశగా తీసుకెళ్లారు .

అయితే చంద్రబాబు గెలవడానికి జగన్ ఓడిపోవడానికి ఒకే ఒక్కటికారణం అంటూ జనాలు భావిస్తున్నారు . చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం .. చంద్రబాబును జైలుకు పంపించడం . జగన్ చేసిన పెద్ద మిస్టేక్ అని చంద్రబాబును జైలుకు పంపీకుండా ఉండి ఉంటే ..పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సపోర్ట్ చేసి ఉండేవాడో..? చేయకుండా ఉండేవాడో..? సెకండరీ మేటర్ . చంద్రబాబు జైలుకు వెళ్లడం కారణంగానే పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పాటు చేశారు అని అదే జగన్కు భారీ బొక్క పడేలా చేసింది అని జగన్ దరిద్రం అలా వెంటాడింది అని మాట్లాడుకుంటున్నారు జనాలు..!!