పవన్ కళ్యాణ్ ..పవన్ కళ్యాణ్ .. పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు . ఆయన విజయం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వచ్చింది ..ఆయనకు సపోర్ట్ చేయాలి అంటూ మెగా ఫ్యామిలీ లేడీస్ కూడా వచ్చే ప్రచారం చేశారు .
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ పలు సర్వేలు చెప్పేశాయి. అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారు అన్న విషయం అందరికీ తెలుసు.. భారీ ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అంటూ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ట్రోలర్స్ ముందుగానే ఒక మెగా హీరోని టార్గెట్ గా చేసుకొని రెడీగా మీమ్‌స్ క్రియేట్ చేసి పెట్టుకున్నారట . పవన్ కళ్యాణ్ గెలిచిన మరొక క్షణం ఆ మీమర్స్ ట్రోల్లర్స్ ఆ మీమ్‌స్ ను రిలీజ్ చేస్తారట .
అది మరెవరో కాదు అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్విట్ చేసి ఆ తర్వాత వైసిపి కాండిడేట్ కు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది పెద్ద రాద్ధాంతం కూడా అయింది . ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తారు . అది ఏ రేంజ్ లో కూడా అందరికీ తెలిసిందే ఊహించుకుంటుంటేనే చెమటలు పడుతున్నాయి. అది పరోక్షకంగా పుష్ప2కి కూడా ఇబ్బందులు కలగజేస్తుంది అంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ..మెగా ఫ్యాన్స్ ..అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మాటలు యుద్ధం మొదలైంది..!!