పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ చాలామంది స్టార్స్ కోరుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవాలి అంటూ ఈ స్టార్ హీరోయిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఏపీ రాజకీయాలలో కూడా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కేవలం మరికొద్ది గంటల్లోనే ఏపీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది .
ఈ క్రమంలోనే చాలామంది స్టార్స్ ఎవరు ఈసారి అధికారం చేపట్టబోతున్నారా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు చాలామంది జనాలు. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో గెలుస్తాడా..? గెలిస్తే ఎన్ని ఓట్ల భారీ మెజారిటీతో గెలవబోతున్నారు..? ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి..? అనే విషయాలపై మాట్లాడుకుంటున్నారు . అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారు అంటూ పలు పోల్స్ కూడా చెప్పేసాయి .
ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమి భారీ స్థాయిలో ఓట్లు దక్కించుకొని అధికారం చేపట్టబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుంచి అభిమానం కల ఓ స్టార్ హీరోయిన్ ఆయన గెలవాలి అంటూ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తుందట. హనుమాన్ జయంతి సందర్భంగా .. మొదలుపెట్టిన పూజలు ఆయన భారీ మెజారిటీతో గెలిచాడు అనే వరకు భారీ హోమంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుందట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!