కూటమి అధికారం చేపడితే పవన్ కళ్యాణ్ కి బొక్క పడుతుందా..? ప్లస్ గా మారుతుందా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుంది అన్న విషయమే హాట్ హాట్ ట్రెండ్ అవుతుంది . మరికొద్ది గంటల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది . దీంతో ఏపీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది . చాలా చోట్ల 144 సెక్షన్ విధించారు . అంతేకాదు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా సెక్యూరిటీ క్రియేట్ చేశారు. కాగా పలువురు మీమర్స్ ట్రోలర్స్ సోషల్ మీడియాలో రాజకీయ నేతలను ఆడేసుకుంటున్నారు . రీసెంట్గా రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ సైతం కూటమి అధికారం చేపట్టబోతుంది అని భారీ మెజారిటీతో ఈసారి ఏపీ ఎన్నికలు చరిత్ర సృష్టించబోతున్నాయి అని చెప్పేశారు.

ఈ క్రమంలోనే కూటమి అధికారం చేపడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంతవరకు న్యాయం జరుగుతుంది…? ఆయనకు ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా..? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు . నిజానికి పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేసి ఉంటే కచ్చితంగా అధికారం చేపట్టే అన్ని సీట్లు గెలవలేడు ..అది అందరికీ తెలిసిందే . ఒకవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా టిడిపి పోటీ చేసి ఉన్నా కూడా కచ్చితంగా ఓట్లు చీలిపోతాయి.. టిడిపి కూడా అధికారం చేపట్టలేదు ..వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తూ బిజెపి కూడా రంగంలోకి దిగడం కొంచెం ప్లస్ అయిందని చెప్పాలి.

అయితే బిజెపి ఎందుకు టిడిపికి సపోర్ట్ చేసింది అన్న విషయం కూడా తెలుసు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే.. పవన్ కళ్యాణ్ కారణంగానే ఇప్పుడు కూటమి అధికారం చేపట్టబోతుంది . కచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు అంటున్నారు జనసైనికులు . అంతేకాదు కూటమి అధికారం చేపట్టిన తర్వాత తన రాజకీయ అనుభవంతో ఏవైనా తర్జనభర్జన చేసిన కన్నింగ్ ప్లాన్స్ వేసిన .. పవన్ కళ్యాణ్ ని తొక్కాడానికి చూసిన కచ్చితంగా దానికి తీవ్ర పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు అంటూ జనసైనికులు హెచ్చరిస్తున్నారు .. ఎందుకంటే జనసైనికులు జనసేన సపోర్ట్ తోనే సగానికి పైగా ఇప్పుడు కూటమి అధికారం చేపట్టబోతుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరనుంచి ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని .. నెక్స్ట్ రాజకీయాలలో సింగిల్గా పోటీ చేసి ..సింగిల్ గా గెలిస్తే బాగుంటుంది అంటున్నారు . మొత్తానికి పవన్ కళ్యాణ్ కి కూటమి అధికారం చేపడితే ఎక్కడ మైనస్ లేదు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!