బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ చార్జ్ చేసే స్టార్ హీరోలుగా ఖాన్‌లు రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ లాభాలలో వాటాలు , ఏరియా హక్కులు, పంపిణీ హక్కులను తీసుకుంటూ ఎన్నో రకాలుగా సంపాదన కూడబెడుతున్నారు బాలీవుడ్ అగ్ర హీరోలు. అయితే ఇప్పుడు బాలీవుడ్లో అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న నెంబర్ వన్ హీరోగా షారుక్ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే షారుక్ను మించి తాజాగా మరో హీరో రెమ్యూనరేషన్ అందుకున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆయన బాలీవుడ్ నటుడు కాకుండా మన సౌత్ హీరో కావడం విశేషం. అతను మరెవరో కాదు కన్నడ రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్ తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన.. ఇటీవల రన్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నితిష్ తిపారి దర్శకత్వం వహిస్తున్నాడు. అదే సినిమాలో రావణుడి పాత్రలో యష్ కనిపించనున్నాడని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో న్యూస్ 18 కథనాల ప్రకారం తెలుస్తుంది.
సౌత్ లో స్టార్ హీరోగా భారీ పాపులారిటి దక్కించుకున్న యష్ ఈ సినిమాకు రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ మొదట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆయన రెమ్యూనరేషన్ మరొక రూ.50 కోట్లు పెంచారని.. ప్రస్తుతం 200 కోట్లు చార్జి చేస్తున్నారంటూ తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న షారుక్ ఖాన్ ను మించి యష్ తన రెమ్యునరేషన్‌తో కెత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లవుతుంది.