పిఠాపురం ఎమ్మెల్యే గారు ..ప్రజెంట్ ఇది ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాము. నిన్న మొన్నటి వరకు పిఠాపురం అనేది జస్ట్ ఒక పేరు మాత్రమే .. ఇప్పుడు అది ఒక బ్రాండ్ల మారిపోయింది.. ఎంతలా అంటే ఎక్కడ చూసినా సరే పిఠాపురం ..పిఠాపురం.. పిఠాపురం అంటూ తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు . మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయడమే అందుకు ప్రధాన కారణం .
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఓట్ల మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే . దాదాపు 74 వేల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచాడు . ఈ క్రమంలోనే ఆయనను అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆయన రిప్లై ఇచ్చే అంత టైం కూడా లేదు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యేగా ట్వీట్ చేశాడు .
“నా విజయాన్ని అభినందిస్తున్న ప్రతి ఒక్కరికి ..నా విజయాన్ని తన విజయం గా భావించిన ప్రతి ఒక్క అభిమానికి .. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్క ఓటర్లకి.. రైతులు.. కార్మికులు, సామాజికవేత్తలు.. విద్యావంతులు పారిశ్రామికవేత్తలు ..మేధావులు మహిళలు యువతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశాడు . ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేగా మారిన తర్వాత ఫస్ట్ టైం పిఠాపురం ఎమ్మెల్యేగా ట్విట్టర్ వేదికగా ఆయన ఈ పోస్ట్ చేయడం గమనార్హం..!!
ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు – JanaSena Chief Shri @PawanKalyan #KutamiTsunami #GameChangerPK pic.twitter.com/WLjM7dVtef
— JanaSena Party (@JanaSenaParty) June 6, 2024