పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఓజి మూవీ ఒకటి. భారీ పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అజయ్ తదితరులు కీలకపాత్ర నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్ 70% వరకు పూర్తయింది అని కూడా మేకర్స్ వివరించారు.
అలాగే సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకుంది. కాగా కొంతకాలంగా పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో.. సినిమా షూట్ కు బ్రేక్ ఇచ్చాడు. అయితే తాజాగా ఆయన ఏపీ ఎన్నికల్లో విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. 100% రిజల్ట్ తో పవర్ స్టార్ రాజకీయాల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో సినిమా షూటింగ్ సమయానికి పూర్తవుందో లేదో.. అసలు పవర్ స్టార్ ఈ సినిమాను పూర్తి చేస్తాడా.. లేదా అని టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.
అదేంటంటే ఓజీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.92 కోట్ల భారీ ధరకు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లొక్స్ కొనుగోలు చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవడంతో నేటిజన్స్ షాక్ అవుతున్నారు. కేవలం ఒక్క సినిమా ఓటీటీ హక్కులు ఏకంగా రూ.92 కోట్ల పెట్టి కొనుగోలు చేశారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క పవన ఫ్యాన్స్ పవర్ స్టార్ సినిమా రేంజ్ అది అంటూ.. ఆ మాత్రం బిజినెస్ జరగడంలో తప్పు లేదులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.