సమంత .. సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూ ట్రోలింగ్కి గురయ్యే పేరు ఏం మాయ చేసావే.. సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన సమంత .. ఆ తర్వాత కుర్రాళ్లని ఎలా తన అంద చందాలతో కట్టిపడేసిందో మనకు బాగా తెలిసిన విషయమే . ఆల్మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సూపర్ స్టార్స్ పవర్ స్టార్ అందరితో నటించింది . స్క్రీన్ షేర్ చేసుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆశ్చర్యం ఏంటంటే సమంత కోసం చాలామంది హీరోస్ కూడా అప్పట్లో కాల్ షీట్స్ కావాలి అంటూ వెయిట్ చేసేవారు . అంతటి క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంత సడన్గా అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి .
అప్పట్లో ఈ విషయంపై వాళ్ళిద్దరూ బుకాయించారు . అలాంటిది ఏమీ లేదు అంటూ కొట్టి పడేశారు. ఫైనల్లీ గోవాలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు .. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లపాటు సంతోషంగానే ఉన్న ఈ జంట ఆ తర్వాత విడాకులు తీసుకుంది . అసలు వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు..? వీళ్ళ విడాకులలో తప్పు ఎవరిది ..? అనే విషయం ఇప్పటికే క్లారిటీ లేదు. అంతేకాదు కొంతమంది సమంతకి వేరే వాళ్ళతో ఎఫైర్ ఉంది అంటుంటే మరి కొంతమంది నాగచైతన్యకు సమస్య ఉంది అని పిల్లలు పుట్టరు అని ఒక రూమర్ క్రియేట్ చేశారు .
నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి . అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన విడాకులపై సంచలన కామెంట్స్ చేసింది.” నేను ఎలాంటి తప్పు చేయలేదు ..నా మ్యారేజ్ లైఫ్ లో నిజాయితీగా ఉన్నాను.. అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలి ..నన్ను నేను ఎందుకు శిక్షించుకోవాలి? పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి అవకాశం వస్తే నన్ను చేయొద్దు చేయొద్దు అంటూ నా కుటుంబ సభ్యులు లు నా ఫ్రెండ్స్ నన్ను బలవంతం చేశారు ..నా తప్పు లేనప్పుడు నేను నిజాయితీగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి “అంటూ సూటిగా ప్రశ్నించింది సమంత . ప్రసెంట్ ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి..!!