ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు కానీ సగానికి మందికి పైగా మెగా హీరోలే ఉన్నారు. అయితే మెగా ట్యాగ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్ హీరో అయిపోయారా.. అంటే నో అన్న సమాధానమే వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొంతమంది అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పటివరకు హిట్ కొట్టిన దాఖలాలే లేవు అయితే కొందరు మాత్రం చాలా చాలా బాగా సక్సెస్ అయ్యారు . ఆ లిస్ట్ లోకి వస్తాడు సాయిధర్మతేజ్.
సుప్రీం హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సాయి ధరంతేజ్ తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ కెరియర్ను ముందుకు తీసుకెళ్తున్నారు . అయితే మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే సాయిధర్మతేజ్ కి మోస్ట్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎంతలా అంటే మెగాస్టార్ చిరంజీవి కన్నా కూడా పవన్ కళ్యాణ్ అంటే నే ఇష్టం. ఆ బాండింగ్ ఆ ర్యాపో అలాంటిది . సాయిధరమ్ తేజ్ – రామ్ చరణ్ ను పెంచింది పవన్ కళ్యాణ్ నే.. అందుకే వాళ్ళకి ఆయన అంటే ఓ ప్రత్యేక గౌరవం ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . రీసెంట్గా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు పవన్ కళ్యాణ్ .
పిఠాపురంలో ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ పార్టీ తరపున సాయి ధరంతేజ్ కూడా వెళ్లారు . అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు . భారీ అటాక్ నుంచి కూడా సింపుల్ గా ఎస్కేప్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గెలిచాడు అని తెలియగానే ఇంటికి వెళ్లి ఏకంగా ఆయనను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఎంజాయ్ చేశాడు . రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ పార్టీలో సాయిధరమ్ తేజ్ సందడి చేశారు. పవన్ కళ్యాణ్ కేక్ కట్ చేస్తూ ఉండగా జై జనసేన జై జనసేన అంటూ ఓ రేంజ్ లో అరిచారు .
పవన్ కళ్యాణ్ భార్యను ఎలా ఆటపట్టించాడో కూడా మనం వీడియోలో చూసాం. అయితే పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు సాయిధరమ్ తేజ్ ఇంత ఇష్టమంటే మాత్రం పవన్ కళ్యాణ్ ..సాయి ధరంతేజ్ లైఫ్ని కాపాడడమే కాదు ఆయన కెరియర్ సెటిల్ అయ్యే విధంగా చేశారు. మొదటినుంచి మంచి సలహాలు ఇస్తూ వచ్చారు. అందుకే సాయి ధరంతేజ్ కి పవన్ కళ్యాణ్ నాన్న తర్వాత నాన్న లాంటి వాడు అంటూ ఉంటారు..!!