ఈ ఫోటోలో కనిపిస్తున్న క్రేజీ బ్యూటీ హీరోయిన్ కాదు.. ఓస్టార్ డైరెక్టర్ భార్య ఎవరో గెస్ చేయండి..?!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా క్రేజ్‌ను సంపాదించుకోవాలన్నా.. ఆ స్టేటస్ కొనసాగించాలన్న అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. కేవలం నటీనటులకే కాదు.. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా తమ పేరును నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇక దర్శకుడుగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ముందుకు సాగాలంటే అతని మెంటల్ స్టెబిలిటీ కూడా చాలా అవసరం. ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటేనే ఓ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్గా సక్సెస్ అందుకోగలుగుతాడు. ఇక ఈ విషయాన్ని చాలామంది డైరెక్టర్స్ రుజువు చేశారు కూడా. ఇలాంటి క్రమంలో ఎస్. ఎస్. రాజమౌళి లాంటి డైరెక్టర్.. స్టార్ డైరెక్టర్గా మారడానికి తన భార్య ర‌మా రాజమౌళి చాలా సహాయంగా ఉంటుందని పలు ఇంటర్వ్యూలో వివరించాడు.

Jawan' director Atlee's family moments

అలాగే తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా భారీ క్రేజ్ దక్కించుకున్న అట్లీ కూడా తన భార్య అయిన కృష్ణప్రియ చాలా వరకు హెల్ప్ చేస్తుందంటూ ఎన్నో సందర్భాల్లో వివరించాడు. నిజానికి కృష్ణప్రియ మొదట్లో సీరియల్ హీరోయిన్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అట్లీ శంక‌ర్‌ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్న క్ర‌మంలో కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికీ స్నేహం ఏర్పడటం.. వారిద్దరి మధ్యన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక అట్లి డైరెక్షన్‌లో వచ్చిన రాజా రాణి సినిమా ప్రీమియర్ షోకి కృష్ణప్రియ తన తల్లిదండ్రులను తీసుకువచ్చి అట్లిని చూపించడం.. వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలోనే ఉండడంతో ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు.

అప్పటినుంచి ఇప్పటివరకు అట్లీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక కోలీవుడ్‌లో మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం బాలీవుడ్ లోనూ కొనసాగుతుంది. గత సంవత్సరం షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా తెర‌కెక్కించిన ఈయన రూ.1000 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టి భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో అట్లి మాట్లాడుతూ తన సక్సెస్ కు భార్య అయిన కృష్ణప్రియ అలియాస్ ప్రియ అట్లీ కారణం అంటూ వివరించాడు. తనకు ఇంట్లో ఏ మాత్రం స్ట్రెస్ లేకుండా ఆమె చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే అట్లీ భార్య‌ ప్రియా ఏ మాత్రం హీరోయిన్ల అందానికి తీసిపోదు.. ప్రేక్షకులు అందర్నీ మెస్మరైజ్ చేస్తూ ఉండే ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. నిర్మాణా రంగం వైపు అడుగులు వేస్తుంది. ఏ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి అందులో పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించే ప్రయత్నాలు చేస్తుంది.