దర్శక ధీరుడు రాజమౌళి సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమా సెట్స్ పైకి రాకముందే అభిమానుల్లో ఆసక్తి మొదలైపోతుంది. ఆయన ఇటీవల తీసిన ప్రతి మూవీ ఓ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న రాజమౌళి.. ప్రస్తుతం ఓ పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు మహేష్ బాబు హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసిన రాజమౌళి.. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడంటూ తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఒక ప్రెస్ మీట్‌ను పెట్టి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రిలీజ్ చేయనున్నాడట. అందులో భాగంగా జక్కన.. మహేష్ ను ఏ క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. ఈ సినిమా అడ్వెంచర్స్ జోనర్‌లో రానున్న క్రమంలో ఇప్పటికే సినిమాలోని మహేష్ పాత్రకు భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్ తో కూడిన కథను తీర్చిదిద్దాడట జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్. దానికి తాగ్గట్టుగానే రాజమౌళి సినిమాకు సూపర్ సక్సెస్ వచ్చేలా శ్రమిస్తున్నాడని తెలుస్తుంది.
ఈ క్రమంలో సినిమా టైటిల్ కూడా ఎంతో కీలకం కానుంది. అందులో భాగంగానే ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ అయితే బాగా నప్పుతుందని.. ఈ టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారంటూ తెలుస్తుంది. పాన్ వరల్డ్ సినిమా కావడంతో తెలుగు టైటిల్ పెడితే పాన్ వరల్డ్ అభిమానులకు రీచ్ కాదనే ఉద్దేశంతోనే పవర్ ఫుల్ గా ఉండేలా ఈ డ్రాగన్ టైటిల్ ను జక్కన సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియాలంటే మేకర్స్ టైటిల్ అనౌన్స్ చేసే వరకు వేచి చూడాలి.