అయ్య బాబోయ్.. బన్నీ ఫ్యాన్స్ కిర్రాక్ ఆర్పీ పై అలా అటాక్ చేయబోతున్నారా..? జబర్ధస్త్ కమెడియన్ కి చుక్కలు చూపించబోతున్నారా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ..అల్లు అర్జున్ పై ఎంత కోపంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి జస్ట్ సపోర్ట్ చేస్తూ ఒక ట్విట్ చేసేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి ప్రత్యర్థి పార్టీలో కనిపించాడు. వైసిపి నేతకు సపోర్ట్ చేశారు . ఈ విషయం సంచలనంగా మారింది . అయితే ఇప్పుడు బన్నీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోవడం అదే విధంగా జనసేన భారీ స్థాయిలో గెలవడం బన్నీకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది .

అంతేకాదు కొంతమంది అల్లు అర్జున్ ని దారుణంగా ట్రోల్ చేశారు ..మాట్లాడారు . ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటి సంపాదించుకున్న కిర్రాక్ ఆర్పి – అల్లు అర్జున్ పై మండిపడుతూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు . “మీకు మీకు ఏమన్నా ఉంటే మీ కుటుంబం చూసుకోవాలి .. కష్టాన్ని బ్రష్టు పట్టించడానికి వచ్చిన పార్టీకి సపోర్ట్ చేయడం ఏంటి ..?”అంటూ ఎక్కువ రేంజ్ లోనే టంగ్ స్లిప్ అయ్యారు.

దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతూ .. ఆయనకు సంబంధించిన హోటల్స్ పై దాడులు చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల ఫ్యాన్స్ కొట్టుకున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే దీనికి బన్ని కారణం కాదు అని.. కావాలని కొందరు వ్యక్తులు బన్నీ కావాలని చేయించాడు అంటూ మండిపడుతున్నారు అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది..!?