ప్రభాస్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో.. రెబల్ హీరో .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఎన్నెన్నో ట్యాగ్స్ వస్తాయి . ప్రజెంట్ ప్రభాస్ కాన్సన్ట్రేషన్ అంతా కల్కి సినిమా పైనే ఉంది . మహానటి డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా హీరోయిన్గా దిశా పటాన్ని – దీపికా పదుకొనేలు నటించిన క్రేజీయస్ట్ మూవీ కల్కి . ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో అశ్విని దత్ మనకు తెలిసిందే . ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా కల్కి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు .
కాగా కల్కి సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు ప్రభాస్. ఈ క్రమంలోని ఆయనకు సంబంధించిన మరికొన్ని విషయాలు బాగా వైరల్ గా మారాయి. ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అంటే మాత్రం వర్షం మూవీ అని చెప్పాలి . ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు . ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా అందుకున్నాడు . కాగా ఈ సినిమాలో పాటలు ఆయనకు మరీ మరీ ఇష్టం అంటూ ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు . అయితే ప్రభాస్ ఆ సినిమాలో పాటలను ఎంజాయ్ చేసిన తర్వాత అంతలా ఎంజాయ్ చేసి డాన్స్ చేసిన పాటలు ఏదైనా ఉన్నాయి అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇలియానా హీరోయిన్గా నటించిన జల్సా మూవీలోని పాటలు ఆయనకు బాగా ఇష్టమట . అప్పట్లో ఈ పాటలకు బాగా డాన్స్ చేసేవాడట . అంతేకాదు ఆ తర్వాత అంతలా నచ్చిన సాంగ్ మిర్చి సినిమాలోని పండగల దిగివచ్చాడు అనే పాట అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . సుమారు ఆ పాటని 176 సార్లు పైగానే విన్నాడట . దేవిశ్రీ అలాంటి ఒక స్పెషల్ సాంగ్స్ కంపోజ్ చేస్తాడు అంటూ పొగిడేసారు . వర్షం – జల్సా – మిర్చి మూడు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కావడం గమనారహం..!!