పవన్ గెలుపు ఆ నిర్మాతకు.. 10 కోట్లు బొక్క పడేలా చేసిందిగా..ఎలా అంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని ఎంత మంది బెట్టింగ్స్ వేశారో మనకు తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఐపీఎల్ కి మించిన రేంజ్ లో బెట్టింగ్ లు జరిగాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాడు పవన్ కళ్యాణ్ . అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ..? గెలవడా..? అంటూ భారీ స్థాయిలో బెట్టింగ్ లు వేశారు పలువురు స్టార్స్ అంటూ కూడా మీడియాలో వార్తలు వినిపించాయి.

కేవలం వేలల్లో కాదు.. లక్షల్లో.. కోట్లల్లో జరిగాయి.. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో దారుణాతి దారుణంగా ఓడిపోతాడు అంటూ ఒక బడ ప్రొడ్యూసర్ ఏకంగా కోట్లలో బెట్టింగ్ వేశారట. అంతే ఒక్కసారిగా ఆయన తలరాత మారిపోయింది . పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో గెలిచాడు . ఈ క్రమంలోనే ఆ ప్రొడ్యూసర్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్లు నష్టపోయాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే 10 కోట్లు నష్టపోయిన ఆ ప్రొడ్యూసర్ తన పేరు మాత్రం ఎక్కడా బయటికి చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ ప్రొడ్యూసర్ కి పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీకి ఎప్పటినుంచో గొడవలు ఉన్నాయట.. ఆ కారణంగానే ఆయన ఓడిపోతాడు అన్న ధీమాతో అంతస్థాయిలో బెట్టింగ్ పెట్టారు అని మాట్లాడుకుంటున్నారు జనాలు. మొత్తానికి పవన్ కారణంగా బాగానే నష్టపోయాడు ఈ తలతిక్కల ప్రొడ్యూసర్..!!