మహేష్ బాబు కు అలా చేస్తే అసలు నచ్చదా.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన సితారా.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదు పదుల వయసులోను యంగ్ హీరో లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఏజ్‌తో సంబంధం లేకుండా గ్లామ‌ర్ మెయింటైన్ చేస్తూ.. రోజురోజుకి ఫాలోయింగ్ రెట్టింపు చేసుకుంటున్నాడు. ఇక‌ మహేష్ కెరీర్ పరంగా మంచి సినిమాలను నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట‌. అయితే ఇలాంటి క్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు.. ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న మహేష్ డాక్టర్ సితార ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆమె మహేష్ గురించి చెప్పిన విషయాలు నెటింట‌ వైరల్ గా మారాయి. కొన్ని పనులు మహేష్ కు అసలు నచ్చవని సితార వివరించింది. మహేష్ బాబు గురించి సీతారా మాట్లాడుతూ.. నాన్నకు ఆయన హెయిర్ ఎవరైనా టచ్ చేస్తే అసలు నచ్చదని.. అప్పుడప్పుడు ఆటపట్టించేందుకు నేను హెయిర్ ట‌చ్‌ చేస్తూ ఉంటానని వివరించింది. ఇక ప్రస్తుతం మహేష్, జ‌క్క‌న‌ కాంబోలో రూపాందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మవీకి సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలు వైర‌ల్ అయ్యాయి. ఈ మూవీలో హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి.

Flashback Friday: Mahesh Babu's wife Namrata relives childhood moments of kids Sitara, Gautam; 'Stop time for me' | PINKVILLA

దీంతో ఈ సినిమాపై క్రేజ్ అంతకు అంతకు పెరిగింది. 2027లో సినిమా రిలీజ్ ఉండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లని తెలుస్తోంది. ఇక జ‌క్కన రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అయితే ఈ వార్తలపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇక మహేష్ మాత్రం ఈ సినిమా పూర్తి అయ్యేవరకు కొత్త సినిమాలు ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. మహేష్ లుక్స్ విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. సరైన డైట్ కూడా ఫాలో అవుతున్నారు. ఇక వీరిద్దరి కాంబోకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. వీరిద్దరి కాంపౌండ్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.