ఎన్టీఆర్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ సముద్ర ఒడ్డున ఉండే ఊళ్ళలో జరిగే మాస్ కథ అని కొరటాల ఈ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక రెండు పార్ట్‌లుగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇక ఎప్పుడెప్పుడు దేవర సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికీ రిలీజ్ అయిన దేవరా గ్లింప్స్, సాంగ్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో జూనియర్ ఆర్టిసిగా నటించిన ఓ కుర్రోడిని.. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం.. అతడు దేవర సినిమా గురించి ఓ రేంజ్ లో చెబుతూ.. కథ మొత్తం రివీల్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. దేవర సినిమాలో రౌడీలో ఒకడిగా నటించిన ఇతను.. ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటారని.. ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా తనే ముందుండి చూసుకుంటాడు అంటూ వివరించాడు. అందరికీ అండగా నిలబడతాడని చెప్పుకొచ్చాడు. అయితే సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఉంటుందని.. అందరినీ నరికేసే సీన్ సినిమాకి హైలెట్గా ఉంటుందని.. ఏకంగా పదివేల మందితో ఈ ఫైట్ సీన్ ఉంటుంది వివరించాడు.
సముద్రం అంతా రక్తంతో నిండిపోద్ది ఈ యాక్షన్ సీన్స్.. మేము లైవ్ లో చూసి నిజంగా షాక్ అయ్యాం. ఎన్టీఆర్ నటన మైండ్ బ్లోయింగ్. సింగిల్ టేక్ లో ఎంత కష్టమైనా డైలాగ్ అయిన చెప్పేస్తారు. సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ కు ఫుల్ పండగే. థియేటర్స్ బ్లాస్ట్ అవడం ఖాయం అంటూ దేవర స్టోరీ పై మరింత హైప్ పెంచేశాడు. కానీ ఈ వీడియో వైరల్ కావడంతో కొంతమంది ఎందుకు ముందే సినిమాలోని ఇంట్రెస్టింగ్ పాయింట్ లీక్ చేసావ్ అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారుజ ఎన్టీఆర్ దేవర మూవీ నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేసి సరైన చర్యలు తీసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో మూవీ యూనిట్ స్పందించి ఆ వీడియోలను డిలీట్ చేయించినట్లు సమాచారం.