శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో.. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఫిదా మూవీ కి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే.. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.
కాగా ప్రస్తుతం ఈ కాంబోలోనే మరో సినిమా రిపీట్ కానుందంటూ వార్తలు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం శేఖర్ ఖమూలా కుబేర, వరుణ్ తేజ్ మట్కా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కాగానే వీరి కాంబోలో మరో సినిమా సెట్స్ పైకి రానుందని.. వరుణ్‌కోసం శేఖర్ ఫదాను మించిపోయే లెవెల్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిద్ధం చేశాడట.
ఇక కథ బాగా నచ్చడంతో వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాతో ఫిదా ను మించిన బ్లాక్ బస్టర్ వరుణ్ తేజ్ సాధించడం ఖాయం అంటూ మెగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.