ప్రాణంగా ప్రేమించిన తన మొదటి భర్తకు మంచు లక్ష్మీ.. విడాకులు ఇవ్వడానికి కారణం అదేనా..?!

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. అయితే ఆమె వికీపీడియాలోనూ ఆమె మొదటి భర్త గురించి ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. కేవలం రెండవ భర్త ప్రస్తుతం మంచు లక్ష్మితో కలిసి ఉన్న ఆండ్రి శ్రీనివాస్ గురించి మాత్రమే ఆమె వీకీలోను రాసి ఉంటుంది. కానీ ఆమె మొదటి భర్త.. అలాగే మొదటి పెళ్లి గురించి ఇప్పటి యువతకు అసలుకు తెలియనే తెలియదు. ఇక‌ ఆమె చదువుకుంటున్న టైంలోనే తన కాలేజ్ మేట్ అయినా ఓ వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. తన ప్రేమను తండ్రి మోహన్ బాబు కాదనడంతో.. ఇంట్లో తండ్రి లేని స‌మ‌యంతో చెప్పకుండా పారిపోయి ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్న మంచు లక్ష్మి.. పెళ్లి చేసుకున్న కొంతకాలానికే అతనికి విడాకులు ఇచ్చేసింది.

అయితే అప్పట్లో ఆ విడకులకు కారణం మంచు మోహన్ బాబు ఏ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె ప్రేమ పెళ్లి ఇష్టం లేని మోహన్ బాబు.. మొదట్లోనే ఆమెకు అభ్యంతరం చెప్పారట. మురళీమోహన్, దాస‌రి నారాయ‌ణ‌ లాంటి ఎంతోమంది స్టార్స్ వాళ్లకు మధ్యవర్తులుగా మారి పంచాయతీ కూడా చేశారు కానీ ఆ ప్ర‌య‌త్నాలు వ‌ర్కౌట్ కాలేద‌ట‌. అలాగే ఆమె మొదటి భర్త పేరు లండన్ శ్రీనివాస్. అతనికి ఇక్కడ ఉద్యోగం దొరకకుండా ఏడాది పాటు ఎన్నో ఇబ్బందులు పెట్టడట మోహన్ బాబు. అంతేకాదు అతని కుటుంబ సభ్యులు, బంధువులను కూడా రౌడీలను పెట్టి బెదిరించాడ‌ని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యేవి. అందులో నిజా నిజాలు తెలియదు కానీ.. ఆయన బెదిరింపులను భరించలేక ఓసారి తండ్రితో ఏదో ఒకటి తెల్చుకోవాల‌ని మంచు లక్ష్మి ఇంటికి వెళ్లిందట‌.

భర్త కూతురుతో లక్ష్మి మంచు విదేశీ విహారం.. పిక్స్ వైరల్.. – News18 తెలుగు

మళ్లీ ఆ ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదని తెలుస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆమె మళ్లీ తిరిగి బయటకు రాలేకపోయిందట. అప్పుటి పోలీసుల నుంచి.. ముఖ్యమంత్రి వరకు లండన్ శ్రీనివాస్ అందరితోనూ విషయాన్ని చెప్పి మొరపెట్టుకున్నా.. ఎటువంటి ప్రయోజనం లేదని.. చివరకు తన భర్తకు ముప్పు ఉంది కనుక ఈ పెళ్లికి అర్థం ఉండదు అనే ఉద్దేశంతో మంచు లక్ష్మి అల‌డికి విడాకులు ఇచ్చేసిందని.. ఇండియాలోనే ఉంటే ఆమె మనసు మళ్లీ మారిపోతుంది ఏమో.. అనే భయంతో మంచు మోహన్ బాబు ఆమెను విదేశాలకు పంపి థియేటర్ కోర్స్ నేర్పించార‌ని.. అక్కడ కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ తో అమ్మడు ప్రేమలో పడిందని అంటారు. దీంతో వెంటనే మోహన్ బాబు అక్కడ నుంచి కూడా మంచి లక్ష్మిని తీసుకువచ్చేసి.. యాండ్రీ శ్రీనివాస్ తో పెళ్లి జరిపించారని టాక్.