ప్రభాస్ బుజ్జి పై కన్నేసిన నాగచైతన్య.. డార్లింగ్ కారులో చెక్కర్లు కొట్టిన అక్కినేని హీరో( వీడియో )..?!

రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా.. భారీ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ కల్కి. ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ భైరవగా ఫ‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక రీసెంట్గా ఈ సినిమాలో మేజర్ పార్ట్‌గా కనిపించనున్న బుజ్జి పాత్రను రివిల్ చేశారు మేకర్స్. బుజ్జి అనే రోబోను పరిచయం చేశారు.

Kalki 2898 AD: Prabhas' sidekick Bujji's 'body' introduced with new teaser at an event. Watch - Hindustan Times

ఆ రోబో ను స్పెషల్ గా కార్‌లా కష్టమైజ్‌ చేసి గ్రాండ్ లెవెల్ లో ఇంట్రో ఇచ్చారు. రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి మరి దాని గురించి వివరించారు. 50వేలకు పైగా ప్రభాస్ అభిమానులు ఈ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు. ప్రభాస్ బుజ్జి కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. స్పెషల్ గా కష్టమైజ్‌ చేసిన ఈ కారు చూడడానికి వింతగా అందరిని ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఈ బుజ్జి (కార్‌)ను నాగచైతన్య డ్రైవ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోను కల్కీ మేకర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇంజనీరింగ్ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తూ దీనిని సృష్టించారంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు చైతన్య.

Naga Chaitanya says he is 'in shock' after driving Bujji, made for Prabhas' Kalki 2898 AD. Watch - Hindustan Times

ఇక చైతన్యకు ఉన్న కార్ల పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన దగ్గర ఎన్నో కాస్ట్లీ కార్లు ఉన్నాయి. ఇటీవల లగ్జరీ కార్ కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ బుజ్జి పై కన్నేసిన చైతన్య.. ఆ కారులో చెక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేశాడు. ఇక ఓ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా కల్కి 2898ఏడి తెర‌కెక్కుతుంది. ఈ సినిమాల్లో హీరోయిన్గా దీపికా పదుకొనే, దిశా పఠాని నటిస్తున్నారు. కమలహాసన్, అమితాబచ్చన్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక సినిమా రిలీజ్ అయ్యి ఏ రేంజ్‌లో సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.