కార్లు, బంగ్లాలు.. గెటప్ శీను మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. స్వయంగా వెల్లడించిన స్టార్ కమెడియన్..

తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్‌గా పాపులారిటీ దక్కించుకున్నారు. వారిలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్ అచంట, సుడిగాలి సుదీర్, ఆటో రామ్‌ప్రసాద్, గెటప్ శ్రీ‌ను ఇలా ఎంతోమంది ఉన్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి హైదరాబాద్‌లో సొంత ఇల్లు, కార్లు సంపాదించి స్టార్ సెలబ్రిటీస్‌గా మారారు. గెటప్ శీను జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ల‌లో ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలగా కామెడీతో పండించే గెటప్ శ్రీ‌ను.. ఎన్నో రకాల గెటప్స్ వేసి జనాలను ఆకట్టుకున్నాడు. గెటప్ శ్రీ‌ను జబర్దస్త్ వేదికపై వేసిన కొన్ని గెటప్స్ ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక శ్రీ‌ను, సుధీర్, రామ్‌ప్రసాద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ముగ్గురు కలిశారంటే స్కిట్ కొట్టి తీరాల్సిందే.

Getup Srinu Emotional Comments on Chiranjeevi In Extra Jabardasth Promo |  అందరూ భజన అని అంటారు కానీ.. చిరు భక్తిని చాటుకున్న గెటప్ శ్రీను News in  Telugu

నవ్వులు పూయాల్సిందే. జబర్దస్త్ మానేసి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం నటుడిగా పలు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నా.. ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టిన హనుమాన్ లో ఓ కీల‌క‌ పాత్రలో నటించాడు. రాజు యాదవ్ టైటిల్ తో హీరోగా కూడా మూవీ నటించాడు. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానంది. సిల్వర్ స్క్రీన్ మీద కూడా స్టార్ కామెడియన్గా పాపులారిటీ దక్కించుకుంటున్న గెటప్ శ్రీ‌ను.. ఇటీవ‌ల తన ఆస్తులపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జబర్దస్త్ వల్ల సెటిల్ అయిన మాట వాస్తవమే కానీ.. కోట్లు సంపాదించాను అనేది అబద్ధం.. ఇల్లు ఉంది దానికి ఈఎంఐ కట్టాలి.

Getup Srinu Speech @ HanuMan Teaser Launch Event | Shreyas Media - YouTube

అలాగే కారు మీద కూడా ఈయ‌మ్ఐ ఉంది. అలాగే నేను పెద్ద పెద్ద బంగ్లాలు, బిఎండబ్ల్యూ కార్లు కోరుకోను.. ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉంటున్నాం అంటూ వివరించాడు. పెద్దపెద్ద కమిట్మెంట్స్ పెట్టుకుంటే నిద్ర ఉండదు. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఉదయాన్నే ప్రశాంతంగా లేచేలా జీవితం నాకు ఉండాలి. డబ్బు ఒత్తిడి ఉన్న ఈ సినిమా పడితే అది చేయాల్సి వస్తుంది. అప్పుడు క్రియేటివిటీ దెబ్బతినే అవకాశం ఉంది. ఒత్తిడి లేకపోతే సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ నా వరకు నేను హ్యాపీగా ఉండగలను. వర్క్ సైడ్ డిస్టర్బ్ కాకూడదు అని.. నేను అనుకుంటా అంటూ వివరించాడు. ఇక జబర్దస్త్ మానేసిన షోను మిస్ అవకుండా చూస్తాను అన్న గెటప్ శ్రీ‌ను.. రామ్‌ప్రసాద్, సుడిగాలి సుదీర్‌ను తరచూ కలుస్తూనే ఉంటానని.. వాళ్ళని ఎప్పుడూ మిస్ అవ్వన‌ని చెప్పుకొచ్చాడు.