సీనియర్ హీరోయిన్ సౌందర్య భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..!

సీనియర్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఉన్నంతకాలం తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని మెప్పించింది. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు పొందింది ఒక్క సౌందర్య మాత్రమే. ఇక ప్రస్తుతం ఈమె మన మధ్య లేకపోవడం బాధాకరం. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది.

ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితులు రఘుని వివాహం చేసుకుంది సౌందర్య.ఇక అనంతరం ఈమె 2004 లోనే ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారం ఇస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఇక సౌందర్య మరణించినప్పటికీ వీరి వివాహం జరిగి సంవత్సరం కూడా కాలేదు. ఇక అంతలోని సౌందర్య చనిపోవడంతో ఈమె భర్త చాలా కృంగిపోయాడు.

ఈమె జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు నిర్వహించారు రఘు. అంతే కాకుండా సౌందర్య పేరు మీద స్కూల్ కూడా నడుపుతున్నారు. ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు రఘు. ఇక రఘు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అనే విషయాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈయన గోవాకి చెందిన డాక్టర్ అర్పితను రెండవ వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం సౌందర్య ని మర్చిపోయి తన లైఫ్ని సెటిల్ చేసుకున్నాడు రఘు.