సంక్రాంతి రోజు గొబ్బెమ్మలను పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే..!

సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం.. సంక్రాంతి ఓ ప్రఖ్యాతత ఉంటుంది. అన్ని పండగలు ఒకలా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం వేరే లెవల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు పిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తులైన గోపికలకు సంకేతం.

ఈ ముద్దుల తల మీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్య స్త్రీలకు సంకేతం. ఆ గోపికల స్త్రీల రూపాయలకు సంకేతమే గోపి + బొమ్మలు = గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం.

సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తారు. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున్న పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇందువల్లే సంక్రాంతికి గొబ్బెమలను పెడుతూ ఉంటారు మన పెద్దలు.