బుక్ మై షో లో రేర్ రికార్డును క్రియేట్ చేసిన ‘ హనుమాన్ ‘.. ఏం జరిగిందంటే..?

తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజై భారీ సక్సెస్ సాధిస్తే కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతుంది. ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించిన హనుమాన్ మూవీ ఖాతాలో బుక్ మై షో వేదికగా మరో రేర్ రికార్డు క్రియేట్ అయింది. ఇంతకీ రికార్డు ఏంటి.. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బుక్ మై షో లో హనుమాన్ సినిమా టికెట్లు తాజాగా పది లక్షలు అమ్ముడుపోయాయని టాక్. హనుమాన్ మూవీ ఖాతాలో ఇది నిజంగా ఓ రేర్‌ రికార్డ్‌ అని చెప్పాలి. దీంతో ఫాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

రెండు రోజుల్లో ఈ సినిమా రూ.24 కోట్ల‌పైగా గ్రాస్ సాధించింది. ఆదివారం కలెక్షన్లతో హనుమాన్ మూవీ దాదాపు అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను రీచ్ అయిందని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో హనుమాన్ మూవీ కథలో మరిన్ని రేర్ రికార్డులు చేరడం ఖాయం అంటూ అభిమానులు తమ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ తో పరిమితమై తెర‌కెక్కడంతో ఇప్పటికే నిర్మాతలకు ఈ సినిమాతో భారీ లాభాలు వచ్చాయని తెలుస్తుంది. హనుమాన్ మూవీకి నార్త్ లో ఎక్స్పెక్టేషన్స్ మించి రెస్పాన్స్ వస్తోంది.

Hanu Man Early Premiers Opened To Terrific Bookings | cinejosh.com

ఇక తేజ సజ్జా.. తన నెక్స్ట్ సినిమాను కూడా స్టార్ డైరెక్టర్ డైరెక్షన్‌లో నటిస్తే అంచనాలను మించి సంచలనాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఇకముందు తేజ ఎంచుకునే ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రెమ్యున‌రేష‌న్ మ‌రింత‌ పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. తేజ సజ్జన అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమాతో తేజ స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ మరిన్ని సినిమాలు నటించాలని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరిద్దరు కాంబోలో హనుమాన్ సీక్వెల్ గా రాబోతున్న సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది.