ఎట్టి పరిస్థితులలోనూ తల్లిదండ్రులు పిల్లల ముందు చెయ్యకూడని.. ఐదు పనులు ఇవే…!!

సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు చిన్న చితక గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే అరవడం, గొడవ పడడం చేస్తుంటారు. దీనిని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరిస్తారు. పిల్లల ముందు ఈ ఐదు పనులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. క్రమశిక్షణా రాహిత్యం:


ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణా రాహిత్యం అసలు ప్రవర్తించకూడదు. పిల్లలకి మొదటి గురువులు తల్లిదండ్రులు కాబట్టి.. ఏ విధంగా మీరు ప్రవర్తిస్తే వారు కూడా మీ పట్ల అదే విధంగా ప్రవర్తిస్తారు.

2. అబద్ధం చెప్పడం:
చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో పిల్లల ముందు అబద్ధాలు చెబుతూ ఉంటారు. వారు కూడా పెద్దయ్యాక అవే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది.

3. తప్పుడు పదాలు మాట్లాడకూడదు:
సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకున్నప్పుడు, తిట్టుకున్నప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవే మీ పిల్లలు నేర్చుకుంటారు.

4. పిల్లల ముందు అవమానించరాదు:


ప్రతి ఒక్క తల్లిదండ్రులు మధ్య గొడవలు సహజం. కానీ వాటిని పట్టుకుని పిల్లల ముందు అవమానించకూడదు.

5. అసభ్య ప్రవర్తన:
పిల్లల ముందు భార్యాభర్తలు అసభ్యంగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే పిల్లలకి కూడా అదే మైండ్ లో ఉంటుంది.

ఈ ఐదు తప్పులు మీ పిల్లల ముందు అస్సలు చేయవద్దు. చేస్తే మీరే రానున్న కాలంలో నష్టపోతారు.