హీరోయిన్ మాధవి వేలకోట్ల ఆస్తి వెనుక ఇంత రహస్యం ఉందా..?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తన అందంతో , నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ మాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మాతృదేవోభవ వంటి సినిమాలలో నటించి తన నటనతో పూర్తిస్థాయిలో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. చిరంజీవితో కలిసి ఖైదీ సినిమాలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక మాధవి విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో గోవిందస్వామి, శశిరేఖా దంపతులకు జన్మించిన మాధవి హైదరాబాదులో పెరిగింది.

ఈమె అసలు పేరు కనకమహాలక్ష్మి. చిన్నప్పటి నుంచి భరతనాట్యం పట్ల ఆసక్తి ఉండడంతో ఆమె తల్లి అందులో శిక్షణ ఇప్పించారు. అందుకే ఈమె భరతనాట్య కళాకారిణి కూడా.. ఇక విద్యాభ్యాసం హైదరాబాద్ అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలల్లో పూర్తి చేసింది. చిన్నతనంలోనే ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకున్న ఈమె స్కూల్ రోజుల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 13 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత మాధవిగా తన పేరును మార్చుకొని చిరంజీవితో ఎన్నో సినిమాలలో నటించింది. ఇక అవకాశాలు తగ్గిన సమయంలో బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మని 1996లో వివాహం చేసుకొని భర్తతో కలిసి అమెరికాలోని న్యూ జెర్సీలో స్థిరపడింది .ఈ జంటకు ముగ్గురు పిల్లలు.

మాధవి భర్త భారత , జర్మన్ సంతతికి చెందిన వాడు కాగా అతడు మెడికల్ కంపెనీ తో పాటు రెస్టారెంట్స్ బిజినెస్ లు కూడా నడుపుతున్నారు. వీటి విలువ వేలకోట్లలోనే ఉంటుందని సమాచారం. ఇక ఆమె సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు అలాగే తన భర్త ద్వారా వస్తున్న డబ్బు అంతా కలిపి ఇప్పుడు వేలకోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హీరోయిన్ మాధవి ఆస్తుల చిట్టా చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.