అతడి వల్ల నేను దారుణంగా మోసపోయా.. మానసిక ఒత్తిడి కూడా లోనయ్యా.. రీతు చౌదరి

స్టార్ బ్యూటీ రీతు చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన చౌదరి తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇటీవల రీతు చౌదరి ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయానంటూ.. చాలా ఆర్థిక నష్టం జరిగిందని.. మానసిక వతిడికి కూడా లోనయ్యానంటూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్ వల్ల నాకు చాలా మోసం జరిగిందని.. మానసిక ఆందోళనకు గురయ్యానని వివరించింది.

కొంతకాలం క్రితం నేను ఓ ఇంటిని తీసుకున్నాను దాదాపు 6 నెలల క్రితం ఆ వీడియోని కూడా మీ అందరితో షేర్ చేసుకున్న. అప్పటినుంచి ఇప్పటివరకు ఇంటిరియర్ వర్క్ కంప్లీట్ కాలేదు. మధ్యలో చాలా సమస్యలు వచ్చి ఇంకా పని ఆలస్యమైంది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న డాడీ చనిపోవడంతో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న. ముఖ్యంగా ఈ ఇంటి విషయంలో ఇల్లు కొన్నాక నేను తీవ్ర మానసిక కొంగుబాటుకి లోనయ్యాను. ఆర్థికంగా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న. ఇంటీరియర్ వర్క్ ను మొదట మేము ఓ వ్యక్తికి అప్పగించాం. అతడికి రూ.5 లక్షలు ఇచ్చాం.

పని రాకపోవడంతో సగం సగం పని చేశాడు. దాంతో అతని పని నచ్చక తీసేసాం. డబ్బులు తిరిగి ఇవ్వమంటే నానా మాటలు అనేవాడు. ఫోన్ చేస్తే సరిగా స్పందించేవాడు కాదు. దీంతో నేను చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఆర్థిక ఇబ్బందులు.. ఓవైపు బ్యాంక్ ఈఎంఐలు కట్టుకుంటూ మరోవైపు ఇంటి పని పూర్తికాక సతమతమయ్యేదాన్ని. చివరికి పోలీసుల ప్రమేయంతో కొంత డబ్బును తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటీరియర్ వర్క్ వేరే వాళ్ళ చేతిలో ఉంది. నాకు ఏదురైన ఇబ్బంది ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నా అంటూ వివరించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.