ఈ మొక్క మీ ఇంట్లో ఉందా.. ఈ అందమైన పువ్వులతో హార్ట్ ఎటాక్ ముప్పు..

ప్రస్తుత జీవనశైలిలో చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా గుండె నొప్పికి గురవుతున్నారు. అయితే ఒక పువ్వు కూడా గుండెపోటుకు కారణం అవుతుందని మీరు నమ్మగలరా.. అవుననే చెబుతున్నారు పరిశోధకులు. ఫాక్స్ గ్లోవ్‌ అనే ఓ రకమైన పువ్వు గుండెపోటుకు కారణంగా మారుతుందట. దీన్ని శాస్త్రీయ నామం డిజిటలీజ్‌. ఇది పింక్ పర్పుల్ పువ్వులా కనిపిస్తుంది. అయితే ఇందులో ఒకే కాండం మీద చాలా పువ్వులు వస్తాయి. సాధారణంగా అయితే ఇవి యూర‌ప్‌, ఆసియాలో ఉంటాయి. కానీ మానవ నివాస ప్రదేశాల్లో ఫాక్స్ గ్లోవ్ పూలు కనిపించవు. ఎందుకంటే కేవలం ఈ పువ్వు వాసన చూడటం మాత్రమే కాదు, తాకడం కూడా ప్రాణాపాయమట.

ఇది ప్రధానంగా గుండె పనితీరును ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. ఇందులోని కారకాలు కొన్ని గుండెకు హానికారమట. నెమ్మదిగా ఇది గుండెచప్పుడులో మార్పును కలిగించి గుండెపోటు వరకు తీసుకువెళుతుందని సమాచారం. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందట. అయితే అందరికీ ఒకే రకమైన సమస్యలు తీవ్రత ఉండదు. అనేక మోతాదులో ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. ఇది కొందరి మరణాన్ని కి కూడా కారణం కావచ్చు. వికారం, అస్పష్టమైన దృష్టి, నెమ్మదిగా పల్స్ ప‌డిపోటం, వాంతులు, మైకము, అధిక మూత్ర విసర్జన, కండరాల బలహీనత, వణుకు, గందరగోళం ఇలాంటి లక్షణాలు అన్ని ఈ వాసనను పీల్చడం వల్ల కలుగుతాయి.

ఏది ఏమైనా ఈ పువ్వును తాకినా, వాసన చూసిన ప్రాణాపాయం తప్పదట. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని చెప్తున్నారు. చాలా చోట్ల ఈ పువ్వు అందాన్ని చూసి ఆసుపత్రిలో చేరిన ఘటనలే కనిపించాయట. ఇలాంటి పువ్వులు గుండెకు సంబంధించిన అనేక సమస్యలకు మందులను తయారు చేయడానికి కొన్ని భాగాలు వినియోగిస్తారు. ఇకపై ఇలాంటి పువ్వు తారస పడితే దానికి దూరంగా ఉండడం మంచిది.