పుష్ప2 లో చిరంజీవి.. పుష్ప 1 లోనే హింట్ ఇచ్చిన సుకుమార్.. ఆ సీన్ ఇదే..!!

పుష్ప ..పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదేలే ..ఈ డైలాగ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనం చూసాం . సినిమా రిలీజ్ అయి ఏళ్లు గడుస్తున్నా సరే ఇప్పటికి మన ఇంట్లో పిల్లలు దగ్గరనుంచి మన వాడుక భాషలో ఈ డైలాగ్ ని వాడుతూనే ఉంటాం . అంతలా ఈ సినిమా మన బుర్రల్లోకి ఎక్కేసింది . త్వరలోనే పుష్ప2  రిలీజ్ కాబోతుంది.  పుష్ప వన్ సినిమాలో నటించినందుకు గాను బన్నీ నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు .

దీంతో పుష్ప2 పై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . గత వారం రోజుల నుంచి పుష్ప2లో చిరంజీవి కూడా ఉండబోతున్నాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఆయన ఈ సినిమాలో ప్రత్యక్షంగా కనిపించడు ఆయన పాత సినిమాల ద్వారా.. కొన్ని పాటల ద్వారా.. కొన్ని పోస్టర్స్ ద్వారా పుష్ప2లో కనిపించబోతున్నాడు . పుష్పరాజ్ కూడా ఈ సినిమాలో చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడట .

అయితే ఇదే విషయాన్ని పుష్ప వన్ సినిమాలోనే హింట్  ఇచ్చేశాడు సుకుమార్.  శ్రీవల్లి పుష్పరాజ్ బ్రిడ్జిపై మాట్లాడుకుంటున్న టైంలో ఆమె ‘చూడాలని ఉంది’ సినిమా చూడాలి అంటూ చెప్పుకొస్తుంది . ఆ టైంలోనే ఆమె చిరంజీవికి బిగ్ ఫ్యాన్ అంటూ కూడా సుకుమార్ కథలో మనకి ఇంక్లూడ్ చేస్తాడు . అయితే పెళ్లి తర్వాత చిరంజీవి సినిమాలను పుష్పరాజ్ శ్రీవల్లి భార్యాభర్తలుగా చూసి ఎంజాయ్ చేస్తారట . ఆ తర్వాత పుష్ప రాజ్ కూడా చిరంజీవి ఫ్యాన్ అంటూ శ్రీవల్లికి తెలుస్తుంది.  ఆ తర్వాత పుష్ప రాజ్ మన చిరంజీవి పాటలను డైలాగ్స్ ను మెర్జ్ చేస్తూ మెడ్లీలా పర్ఫార్మ్ చేయబోతాడట చేయబోతున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!