రవితేజ ఇంత ఎనర్జటిక్ గా ఉండటానికి కారణం అదేనా..? టాప్ సీక్రేట్ ని రివీల్ చేసేసాడుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు . ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న రవితేజ రీసెంట్గా అభిమానులతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .

ఈ క్రమంలోనే ఓ అభిమాని “సార్ మీరు ఎప్పుడు ఇంత ఆక్టివ్ గా ..? ఎనర్జిటిక్ గా..?  ఉండడానికి కారణం ఏంటి అంటూ ప్రశ్నిస్తాడు..?”.  దీనికి వెంటనే స్పందించిన రవితేజ “నేను ఎప్పుడు పాజిటివ్ మైండ్ తో ఉంటాను ..నా చుట్టూ ఉండే వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను.. అందుకే ఇంత ఎనర్జటిక్  గా ఉంటాను ” అంటూ తనదైన స్టైల్ లో మాస్ ఆన్సర్ ఇచ్చాడు రవితేజ .

ఏ మాటకు ఆ మాటే ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్న రవితేజలా ఎనర్జిటిక్గా ఏ హీరో ఉండదు అని చెప్పాలి. రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో  తెరకెక్కిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమా..స్టూవర్టుపురం గజదొంగ పేరు మోసిన టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్ గా రూపొందుతోంది. ఈసినిమా ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు