ఈ ఫుడ్ తింటూ నీటిని తీసుకుంటున్నారా.. సమస్యలో చిక్కుకున్నట్టే.. ఇంత‌కి ఆ ఫుడ్ ఏంటంటే..?

మన శరీరంలో నీరు ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో తెలిసిందే. రోజుకు మనం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలని నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. దీని వల్ల పలు సమస్యల నుంచి మనం మనల్ని రక్షించుకోవచ్చు. అయితే మనలో చాలామంది భోజన సమయంలో ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. తెలిసి తెలియక మనం చేసే అతిపెద్ద పొరపాట్లలో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా కొన్ని ఆహారాలను తీసుకునేటప్పుడు అసలు నీటిని తాగకూడదట. ఇలా నీటిని తాగడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఎటువంటి ఆహారం తినేటప్పుడు మనం అసలు నీటిని తీసుకోకూడదు ఇప్పుడు చూద్దాం.

అన్నం తినేటప్పుడు మనం అసలు నీటిని తాగకూడదు కారంగా ఉందని, గొంతు పట్టేస్తుందని మనలో చాలామంది అన్నం తినేటప్పుడు ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. అన్నం తినేటప్పుడు అన్నం తిన్న తర్వాత నీటిని ఎక్కువగా తాగకూడదు. దీనివల్ల పొత్తికడుపులో నొప్పి, తిమ్మిర్లు, అజీర్తి సమస్యలు తలెత్తుతాయట‌. అలాగే పెరుగును తీసుకునేటప్పుడు కూడా నీటిని తాగకూడదు పెరుగులో మంచి బ్యాక్టీరియాతో పాటు పోషకాలు కూడా ఉంటాయి. పెరుగును తీసుకున్న వెంటనే నీటిని తాగడం వల్ల దీనిలో ఉండే బ్యాక్టీరియా వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గడంతో పాటు వివిధ రకాల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. అలాగే నిమ్మ జాతికి చెందిన పండ్లను తిన్న వెంటనే నీటిని తాగకూడదు.

ఈ పండ్లను తింటూ నీటిని తాగడం వల్ల కడుపునొప్పి ఉబ్బరం సమస్యలు వస్తాయి. ఇక అరటి పండ్లను తినేటప్పుడు తిన్న తర్వాత వెంటనే నీటిని తాగకూడదు. దీని వలన గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. జీర్ణ క్రియ కూడా దెబ్బతింటుంది. కనుక అరటిపండును తింటూ నీటిని తాగకండి. మసాలా పదార్థాలు కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తిన్న తర్వాత ఘటుకు ఓర్చుకోలేక మంచినీటిని తాగుతుంటారు. అలా నీటిని తాగడం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో నీటికి బదులు పెరుగును తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధంగా ఆహారం తినేటప్పుడు తీసుకున్న తర్వాత ఎక్కువగా నీటిని తీసుకోవడం మంచిది కాదు.