ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు… ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు….!!

ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఒడిదుడుకుల జీవితంలో మనకంటూ కాస్త సమయాన్ని కూడా వినియోగించలేకపోతున్నాం. ఫలితంగా ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. దీంతో డాక్టర్ల వద్దకు పరుగులెత్తి..‌ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తుంది. రోజు కొన్ని అలవాట్లు పాటిస్తే.. వాటన్నిటికీ దూరంగా ఉండొచ్చు… ఆరోగ్యంగా జీవించవచ్చు. అయితే అన్నీ పాటించాల్సిన అవసరం లేదు. మీ సమస్యని బట్టి వాటిల్లో కొన్నైనా చేస్తే సరిపోతుంది. ఉదయం 8 లోపు మీరు చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తొందరగా లేచేందుకు ప్రయత్నించండి:
ఉదయం తొందరగా లేచేందుకు ప్రయత్నించడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు మీ పనులకు వెళ్లే కనీసం రెండు గంటల ముందైనా లేవడం మంచిది. లేదంటే అప్పటికప్పుడు లేచి మీరు ఒత్తిడి భావిస్తారు. దీంతో మీ ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంది.

నీరు తాగడం:
ఉదయం లేవగానే నీరు తాగాలి. కనీసం రెండు గ్లాసుల నీళ్లయిన తాగాలి. రాత్రి పడుకునే ముందు లేసే సమయానికి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి.. డి హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిది.

మెడిటేషన్:
లేచిన తర్వాత రోజు 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ శరీరానికి ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది. అందువల్ల ఉదయం లేవగానే మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి.

ఎండ తగిలేలా చూసుకోవాలి:
ఉదయం ఎండ బాడీకీ చాలా అవసరం. కాసేపు ఎండలో ఉండాలి. అలా ఉండడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది.

కాఫీ, టీ తాగడం:
ఉదయం లేవగానే టీ, కాఫీ తాగినట్లయితే మలబద్ధకం తగ్గుతుంది. అంతేకాకుండా పనిలో కూడా యాక్టివ్ గా ఉండగలుగుతారు.

బ్రేక్ ఫాస్ట్ తినడం:
ఉదయం లేవగానే ఏడు దాటకుండానే బ్రేక్ ఫాస్ట్ తినడం చాలా మంచిది. ఆ తర్వాత తింటే అది డైజేషన్ అవ్వదు. అందువల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినడం చాలా మంచిది.