ఖుషి ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. క్లాస్ మూవీతో విజ‌య్ దుమ్ము దులిపేశాడు!

నిన్న గ్రాండ్ రిలీజ్ అయిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఖుషి మూవీకి పాజిటివ్ టాక్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఈ సినిమాలో జంట‌గా న‌టిస్తే.. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఖుసి.. మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ ర‌న్ ను మొద‌లు పెట్టింది.

క్లాస్ మూవీతో విజ‌య్ దుమ్మ దులిపేస్తున్నాడు. మొద‌టి రోజు కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఖుషి మూవీ రూ. 9.87 కోట్ల షేర్‌, రూ.15.85 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. అలాగే ఓవ‌ర్సీస్ లో ఏకంగా రూ. 4.20 రాబ‌ట్టి మాస్ ర‌చ్చ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 15.37 కోట్లు షేర్‌, రూ. 27.25 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ అందుకుని అంచ‌నాల‌ను మించిపోయింది.

ఖుషి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53 కోట్లు. అయితే ఫ‌స్ట్ డే వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 38.13 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే ఖుషి క్లీన్ హిట్ అవుతుంది. కాగా, ఏరియాల వారీగా ఖుషి సినిమా ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 5.15 కోట్లు
సీడెడ్: 91 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 1.13 కోట్లు
తూర్పు: 66 ల‌క్ష‌లు
పశ్చిమ: 63 ల‌క్ష‌లు
గుంటూరు: 66 ల‌క్ష‌లు
కృష్ణ: 44 ల‌క్ష‌లు
నెల్లూరు: 29 ల‌క్ష‌లు
—————————
ఏపీ+తెలంగాణ‌= 9.87 కోట్లు(15.85కోట్లు~గ్రాస్‌)
—————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 85 ల‌క్ష‌లు
ఇతర భాషలు: 45 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 4.20 కోట్లు
—————————
టోటల్ వరల్డ్ వైడ్ =15.37కోట్లు(27.25కోట్లు~ గ్రాస్)
—————————