గాజు పాత్రల్లో వండిన వంటకాలు తింటున్నారా….. అయితే మీకు క్యాన్స‌ర్ ముప్పు ఎక్కువే…!

మనం రోజు అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఆహారం వండుకోవడానికి, కూరలు చేయడానికి అనేక పాత్రలు ఉపయోగిస్తూ ఉంటాము. అల్యూమినియం, ఐరన్, నాన్ స్టిక్, స్టీల్ ఇలా అనేక పాత్రలను ఉపయోగిస్తాము. వీటిలో వండడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలామంది వీటికి బదులుగా గాజు పాత్రలలో వండుకుంటున్నారు. లోహాలతో చేసిన పాత్రల్లో వండడం మంచిది కాదని వేడి చేసిన ఏమీ కానీ గాజు పాత్రల్లో వండుతున్నారు. అయితే గాజు పాత్రల్లో వండడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

మనం వంటల్లో వాడే కొన్ని పదార్థాల్లో ఆమ్లాతత్వం ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల వండినప్పుడు ఆమ్లతత్వం కారణంగా రసాయనానక చర్యలు జరిగి గాజులో ఉండే పదార్థాలు కూరల్లో కలిసిపోతాయి. గాజు పాత్రలు తయారు చేసేటప్పుడు లెడ్, కోబాల్ట్, కాడ్మియం ఇవి వాడుతూ ఉంటారు. వంటలు వండినప్పుడు వాటిలో ఉండే ఆమ్లతత్వం కారణంగా ఈ పదార్థాలు కరిగి మనం చేసే వంటకాల్లో కలిసిపోతాయి. ఇలా గాజు పాత్రల్లో వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకుంటే అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కోబాల్ట్, లెడ్ వంటి మూలకాలు క్యాన్సర్ కి కారణం అవుతాయి.

గాజు పాత్రలో ఉండిన ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తీసుకోవడం వల్ల డిఎన్ఏ లో మార్పులు వచ్చి క్రమంగా క్యాన్సర్ కారకులుగా మారే అవకాశం ఉంది. అలాగే గాజు పాత్రలో తినడం వల్ల సంతాన ప్రాప్తికి బంగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా గాజు పాత్రలో తిన్నట్లయితే శరీరం బలహీనం కావ‌డం, మూత్రపిండాలు దెబ్బ తినడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అన్నిటి కంటే మట్టి పాత్రల్లో వండిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యం.. దీనివ‌ల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండ‌వు.